థర్డ్‌ వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా హెచ్చరిక..

జెనివా,విధాత‌: కరోనా థర్డ్‌ వేవ్‌పై మరోసారి హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఓవైపు సెకండ్‌ వేవ్‌.. మరోవైపు డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరింయట్ ఇలా..కొత్త వేరియంట్లు వెలుగుచూస్తోన్న తరుణంలో.. ప్రపంచ‌వ్యాప్తంగా కరోనా థర్డ్‌ వేవ్‌ అప్పుడే మొదలైపోయిందని.. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ తొలి దశ‌లో ఉందని వార్నింగ్ ఇచ్చారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్. మీడియాతో మాట్లాడిన ఆయన దుర‌దృష్టవ‌శాత్తు మ‌నం క‌రోనా థర్డ్ వేవ్ ఆరంభ ద‌శ‌లో ఉన్నామని..మహమ్మారి నిరంత‌రం మారుతోంద‌ని, […]

థర్డ్‌ వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా హెచ్చరిక..

జెనివా,విధాత‌: కరోనా థర్డ్‌ వేవ్‌పై మరోసారి హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఓవైపు సెకండ్‌ వేవ్‌.. మరోవైపు డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరింయట్ ఇలా..కొత్త వేరియంట్లు వెలుగుచూస్తోన్న తరుణంలో.. ప్రపంచ‌వ్యాప్తంగా కరోనా థర్డ్‌ వేవ్‌ అప్పుడే మొదలైపోయిందని.. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ తొలి దశ‌లో ఉందని వార్నింగ్ ఇచ్చారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్.

మీడియాతో మాట్లాడిన ఆయన దుర‌దృష్టవ‌శాత్తు మ‌నం క‌రోనా థర్డ్ వేవ్ ఆరంభ ద‌శ‌లో ఉన్నామని..మహమ్మారి నిరంత‌రం మారుతోంద‌ని, మ‌రింత ప్రమాద‌క‌ర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయ‌ని తెలిపారు.. ఇక, ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైర‌స్ 111 దేశాల్లో న‌మోదు అయినట్టు తెలిపిన టెడ్రోస్.. ప్రపంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇక, ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు వారాలుగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.

డబ్ల్యూహెచ్‌వో 10 వారాల స్థిరమైన క్షీణత తర్వాత మరణాలు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఓవైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. కొత్త కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. కాగా, భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి.ఇక, కొన్ని నివేదికల ప్రకారం ఆగస్టులో థర్డ్‌ వేవ్‌ ఆరంభమై సెప్టెంబర్‌లో పీక్‌కు వెళ్లే అవకాశాలున్నాయని హెచ్చరికలు ఉన్న విషయం తెలిసిందే.