ఇక నుంచి ఉబెర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ సేవ‌లు.. మీరు సిద్ధ‌మేనా?

ఇక నుంచి ఉబెర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ సేవ‌లు.. మీరు సిద్ధ‌మేనా?

విధాత‌: ట్యాక్సీలు, ఆటోల ద్వారా ప్ర‌జా ర‌వాణాలో విప్ల‌వాత్మ‌కమైన మార్పు తీసుకొచ్చిన ఉబెర్ (Uber) త‌న ప‌రిధిని విస్త‌రించుxకోనుంది. త్వ‌ర‌లోనే హాట్ ఎయిర్ బెలూన్స్ (Hot Air Balloons) ద్వారా కూడా రైడ్‌లను క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. అయితే తొలుత‌ ఈ సౌక‌ర్యం తుర్కియే (Turkey)లో మాత్ర‌మే అందుబాటులోకి రానుంది.


ఇక్క‌డి ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన కాప్పాడోసియా (Cappadocia) అగ్నిప‌ర్వ‌త ప్రాంతంలో హాట్ ఎయిర్‌బెలూన్ స‌ర్వీసును ఉబెర్ ప్రారంభించేసింది. ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్‌లో త‌మ ప‌రిధిని విస్త‌రించుకోవ‌డానికి ఈ నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంది సంస్థ యాజ‌మాన్యం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


ఎంత ధ‌ర ఉంటుందో తెలుసా?


తుర్కియే వెళ్లిన ప‌ర్యాట‌కులు కాప్పాడోసియాకు వెళితే ఉబెర్ యాప్‌లోనే హాట్ ఎయిర్ బెలూన్‌లో సీటు బుక్ చేసుకోవ‌చ్చు. 20 సీట్లున్న బెలూన్‌లో ఒక్కో సీటుకు టికెటు ధ‌రను 150 డాల‌ర్లు (రూ.13000) వేలుగా నిర్ధ‌రించారు. మొత్తం గంటన్న‌ర పాటు సాగే ఈ రైడ్‌లో బెలూన్ గ‌రిష్ఠంగా 3000 అడుగులు చేరుకుంటుంది.


ఇంత ఎత్తు నుంచి యునెస్కో గుర్తింపు పొందిన కాప్పాడోసియా అగ్నిప‌ర్వ‌త ప్రాంతం అద్భుతంగా క‌నిపిస్తుంద‌ని ఉబెర్ వెల్ల‌డించింది. ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షించే ఈ ప్రాంతంలో 10వ శ‌తాబ్దం నాటి చ‌ర్చ్‌లు, భూగ‌ర్భ గృహాలు కూడా ఉంటాయ‌ని ఉబెర్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. తుర్కియే 100 సంవ‌త్స‌రాల వేడుక‌లు జ‌రుపుకొంటున్న ఈ స‌మ‌యంలో హాట్ ఎయిర్ బెలూన్ బుక్ చేసుకున్న తొలి 100 మంది విదేశీ ప‌ర్యాట‌కుల‌కు టికెట్ ఉచిత‌మ‌ని ఆఫ‌ర్ కూడా ప్ర‌క‌టించింది.