Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తి సచివాలయం సాక్షిగా బట్టబయలు

కమీషన్ల కు ఆశపడి మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం సచివాలయంలో కాంట్రాక్టర్లు చేసిన ఆందోళనతో నిరూపితమైందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తి సచివాలయం సాక్షిగా బట్టబయలు

Congress government’s corruption: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government’s) కమిషన్ల(corruption in commissions) కక్కుర్తి నేడు సచివాలయం సాక్షి(exposed as evidence by Secretariat)గా బట్టబయలైందని బీఆర్ఎస్ (BRS)మాజీ మంత్రి టి.హరీష్ రావు(T. Harish Rao)విమర్శించారు. మాది ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వస్తే ఎందుకు పోలీసులను అడ్డు పెట్టుకొని వెనుక గేటు నుంచి వెళ్లిపోయారని..ఎందుకు ముఖం చాటేసారని? ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా? అని ఎద్దేవా చేశారు. తమ పెండింగ్ బిల్లుల పై సర్పంచ్ లు రోడ్డెక్కినా కాంగ్రెస్ ప్రభుత్వం కరుణించడం లేదని ..కానీ కమీషన్ల కు ఆశపడి మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం సచివాలయంలో కాంట్రాక్టర్లు చేసిన ఆందోళనతో నిరూపితమైందని ఎద్దేవా చేశారు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 6 వేల కోట్ల రూపాయలు బాకీ పడిందని.. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఆ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. కాంట్రాక్టర్ల తరహాలోనే ఉద్యోగులు కూడా తమ బకాయిలు తాము పొందేందుకు కమిషన్లు ఇవ్వాల్సిందేనా? బకాయిలు చెల్లించాలంటూ కొందరు సెల్ఫీలు తీసి వీడియోలు పెడితేనో, కోర్టులకు వెళ్తేనో ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నారు తప్ప నిబంధనల ప్రకారం రావాల్సిన వాటిని కూడా పెండింగ్ లో పెడుతున్నారన్నారు.

ఢిల్లీలో తమ బాస్ లకు కప్పం కట్టేందుకు అన్ని వర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని లోకం కోడై కూస్తోందని… కాంట్రాక్టర్లు ఈ రోజు సచివాలయంలోని ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు చేసిన ధర్నాఆ లంచాల ఆరోపణలు నిజమే అని నిరూపించిందని హరీష్ రావు స్పష్టం చేశారు. 20% కమిషన్ తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లే స్వయంగా సచివాలయానికి వచ్చి ధర్నా చేయడం గతంలో కనీ విని ఎరుగని ఘటన అని.. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు మాయని మచ్చ అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కాములు, కమిషన్ల ప్రభుత్వమని మరోసారి రుజువు అయిందన్నారు. రాహుల్ గాంధీ తాను చెప్పే నీతి సూత్రాలపై ఏమాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే సచివాలయంలో కాంట్రాక్టర్లు మంత్రులపై చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించాలన్నారు. కాంట్రాక్టర్లు చేస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పోరాడుతుందని.. ప్రతి వేదిక మీద కాంగ్రెస్ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హరీష్ రావు చెప్పారు.

బడా కాంట్రాక్టర్లకు కమీషన్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్ లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆపడం అన్యాయమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం అమానుషమని..
తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక శాఖ నుంచి జరిగిన అన్ని చెల్లింపులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.