Court: కోర్టులో మరో న్యాయవాది హఠాన్మరణం

Court: కోర్టులో మరో న్యాయవాది హఠాన్మరణం

విధాత‌: మ‌రోసారి కోర్టులో తీవ్ర విషాదం నెల‌కొంది. నిన్న‌టికి నిన్న హైకోర్టులో వాద‌న‌లు వినిపిస్తూ సీనియ‌ర్‌ న్యాయ‌వాది పసునూరి వేణుగోపాల్ రావు గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

ఆ ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే తాజాగా బుధ‌వారం సికింద్రాబాద్ కోర్టులో ఆవ‌ర‌ణ‌లో న్యాయ‌వాది వెంకటరమణ కోర్టు ఆవ‌ర‌ణ‌లో కుప్ప‌కూలి పోయాడు. తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ వ‌రుస విషాద ఘ‌ట‌న‌ల‌తో స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కొంది.