Suicide | పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య

పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి బలవన్మరణనానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని మాధవరెడ్డి బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది.

Suicide | పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య

విధాత, హైదరాబాద్ : 

పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి బలవన్మరణనానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని మాధవరెడ్డి బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన నరేష్‌ (30) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో నివసిస్తూ బట్టల షాపులో పనిచేస్తున్నాడు.

కాగా, నరేష్ గత నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.  ఏ ఒక్కటీ కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానసిక ఒత్తిడిలో ఉన్న నరేష్‌ మంగళవారం అమీర్‌పేట్‌ నుంచి ఘట్‌కేసర్‌కు వెళ్లి.. రేపల్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.