Ration Cards: కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి

విధాత: కొత్త రేషన్ కార్డు (Ration Cards)ల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ.. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనేఈ రేషన్ కార్డులు (Ration Cards) జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు.