Home Minister Anita| హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక..ఆశ్చర్యపోయిన మంత్రి!

అమరావతి : ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకు అందించే భోజన నాణ్యత ఎలా ఉంటుందో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు స్వీయానుభవంలోకి వచ్చింది. ప్రభుత్వ హాస్టల్స్ లో భోజన నాణ్యత పరిశీలించే క్రమంలో అనకాపల్లి జిల్లా పాయకరావు పేట బీసీ బాలికల గురుకుల హాస్టల్ కు వెళ్లింది. అక్కడ బాలికలతో కలిసి భోజనం చేసే క్రమంలో తన భోజనం ప్లేట్ లో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో మంత్రి అనిత ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తెలియక తెల్లముఖం వేశారు. సిగ్గుతో ముఖంపై చేతులేసుకుని పిల్లలతో పాటు నిర్వేదంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తనకు పెట్టిన భోజనంలో ఇలా బొద్దింక వచ్చిందంటే పిల్లలకు రోజు పెట్టే భోజనం పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. పిల్లలకు సన్న బియ్యం భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన అమలు కావడం లేదని..అస్సలు భయం లేకుండా పోయిందని..ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే అంతా దారికొస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక
బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా, హోంమంత్రి అనిత ప్లేటులో కనిపించిన బొద్దింక pic.twitter.com/P81qHTeMBA
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2025