Sai Tej|మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన సాయి ధ‌ర‌మ్ తేజ్ పెళ్లి.. ఆ హీరోయిన్‌నే చేసుకోనున్నాడా..!

Sai Tej| ఇటీవ‌ల అందాల భామ‌లు, కుర్ర హీరోలు పెళ్లి పీట‌లెక్కుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల క్రితం మెగా హీరో వ‌రుణ్ తేజ్ త‌ను ప్రేమించిన లావ‌ణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి ఇట‌లీలో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌గా, ఆ పెళ్లి వేడుక‌కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజ‌రైంది.

Sai Tej|మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన సాయి ధ‌ర‌మ్ తేజ్ పెళ్లి.. ఆ హీరోయిన్‌నే చేసుకోనున్నాడా..!

Sai Tej| ఇటీవ‌ల అందాల భామ‌లు, కుర్ర హీరోలు పెళ్లి పీట‌లెక్కుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల క్రితం మెగా హీరో వ‌రుణ్ తేజ్ త‌ను ప్రేమించిన లావ‌ణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి ఇట‌లీలో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌గా, ఆ పెళ్లి వేడుక‌కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజ‌రైంది. ఇక ఇప్పుడు సాయిధ‌రమ్ తేజ్ పెళ్ళి టైం వ‌చ్చింద‌ని అంటున్నారు. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన‌ సాయిధరమ్ తేజ్ తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అంఉకున్నాడు. ఇక ఈ మూవీ త‌ర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేశాడు. ఈ మూవీ కూడా మంచి విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత మ‌ధ్య‌లో కొన్ని సినిమాలు ప్లాపులు వ‌చ్చిన ఇటీవ‌ల విరూపాక్ష‌తో పెద్ద హిట్ కొట్టాడు.

అయితే గత రెండు సంవత్సరాల కిందట బైక్ యాక్సిడెంట్ కు గురైన సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు త‌న ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నాడు.అయితే 36 సంవత్సరాలు వచ్చినప్పటికీ సాయి ధరమ్ తేజ్ ఇంకా పెళ్లి ఊసు ఎత్త‌డం లేదు. ఆయ‌న పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నా కూడా తేజ్ స్పందించ‌డం లేదు. ఆ మ‌ధ్య టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ తో సాయి ధరంతేజ్ వివాహం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అంత‌క ముందు రెజీనాతో ప్రేమ‌లో ఉన్నాడ‌ని, ఆమెని వివాహం చేసుకుంటాడ‌ని అన్నారు.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ సాయి ధ‌ర‌మ్ తేజ్- రెజీనా పెళ్లికి సంబంధించి నెట్టింట తెగ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీళ్లిద్ద‌రు సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డుపుతున్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటార‌ని టాక్. దీనిపై ఎంతవరకు నిజం ఉందో తెలియాలి. ఇక ఇదిలా ఉంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నట్లు తెలిపాడు. తన తల్లి పేరు అయిన ‘దుర్గ’ను తన పేరులో యాడ్ చేసుకున్నట్లు వివరించాడు. తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉన్నట్లు ఉంటుందనే భావనతో ఇలా పేరును యాడ్ చేసుకున్నట్లు సాయి తేజ్ తెలిపాడు.