మరో యుద్దం ఆపాను : డోనాల్డ్ ట్రంప్

న్యూఢిల్లీ : అమెరికా(USA) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) థాయ్‌లాండ్-కంబోడియా(Thai-Cambodia Conflict)ల మధ్య సైనిక ఘర్షణల(Stops War)ను ఆపినట్లుగా..ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ(Siege Fire) చర్చల(Peace Talks)కు తక్షణమే అంగీకరించినట్లుగా ప్రకటించారు. ఇప్పటికే ఇండియా-పాకిస్తాన్ వార్ సహా పలు యుద్ధాలను తాను ఆపినట్లు ప్రకటించుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలోకి థాయ్‌ల్యాండ్ – కంబోడియా ఘర్షణ కూడా చేరింది. ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి పలువురు నామినేట్ చేయడంతో పాటు అమెరికా కూడా అధికారికంగా నామినేషన్ పంపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాను మరో యుద్దాన్ని ఆపినట్లుగా ప్రకటించుకున్నారు. స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ థాయ్-కంబోడియాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపైన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను కంబోడియా ప్రధాని హున్‌మానెట్, థాయ్ ప్రధాని పుమ్తోమ్ వెచియాచైతో వేర్వేరుగా మాట్లాడినట్లు చెప్పారు. ఇరు వర్గాలు తక్షణమే కాల్పుల విరమణకు.. శాంతి కోసం ఎదురు చూస్తున్నాయని ట్రూత్‌లో రాశారు.
ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చలు జరపడానికి ఆత్రంగా ఉన్నాయని చెప్పారు. వారు యుద్ధం కొనసాగిస్తే.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు దెబ్బతింటాయని హెచ్చరించినట్లు తెలిపారు. ఆ రెండు దేశాలకు సుదీర్ఘమైన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉందని ట్రంప్ గుర్తు చేశారు. దీనిపై థాయ్ ప్రధాని పుమ్తోమ్ స్పందిస్తూ.. కంబోడియా చిత్తశుద్ధితో ఉంటే.. తాము కూడా చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు థాయ్ లాండ్-కంబోడియాల మధ్య ఘర్షణలతో ఇప్పటి వరకు 33 మంది మరణించగా 1,30,000 నిర్వాసితులు అయ్యారు. రెండు ఆగ్నేయాసియా దేశాలు ఇటీవల కాలంలో ఇంత తీవ్రంగా తలపడటం ఇదే తొలిసారి. ఇరు దేశాల సరిహద్దుల్లో పలు చోట్ల తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతోంది.