Earthquake | టర్కీని వణికించిన భూకంపం.. 100 మంది మృత్యువాత.. కూలిన భవనాలు

Earthquake | టర్కీ భారీ భూకంపం వణించింది. పొరుగు దేశాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. నూర్దిగికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించగా.. దీని ప్రభావం సిరియా, లెబనాన్‌ వరకు కనిపించింది. భూకంపం కారణంగా పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలిపోయాయి. చాలా భవనాలకు బీటలు వారాయి. ఇప్పటి వరకు దాదాపు వంద మంది వరకు మృతి చెందగా.. 500 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. సోమవారం ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ […]

Earthquake | టర్కీని వణికించిన భూకంపం.. 100 మంది మృత్యువాత.. కూలిన భవనాలు

Earthquake | టర్కీ భారీ భూకంపం వణించింది. పొరుగు దేశాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. నూర్దిగికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించగా.. దీని ప్రభావం సిరియా, లెబనాన్‌ వరకు కనిపించింది. భూకంపం కారణంగా పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలిపోయాయి.

చాలా భవనాలకు బీటలు వారాయి. ఇప్పటి వరకు దాదాపు వంద మంది వరకు మృతి చెందగా.. 500 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. సోమవారం ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ పేర్కొంది.

సోమవారం ఉదయం 4.17 గంటలకు ప్రకంపనలు వచ్చాయని, గాజియాంటెప్ నుండి 33 కిలోమీటర్లు, నుర్దగీకి 26 కిలోమీటర్ల దూరంలో, భూమికి 17.9 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని తెలిపింది. ప్రకంపనలు బలంగా ఉండడంతూ సిరియా, లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది.

భూకంపం ధాటికి భవనాలు దెబ్బతినగా.. ఇప్పటి వరకు 100 మంది వరకు మృతి చెందగా.. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు రెస్క్యూ బృందాలను పంపినట్లు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. విపత్తును కలిసి ఎదుర్కొంటామని, తక్కువ నష్టంతోనే అధిగమించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.