భారత్‌కు మరో 12 చీతాలు.. ప్రపంచంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే..!

ఈ నెల 18న కునో జాతీయ పార్కుకు దేశంలో అంతరించిపోయిన చిరుతలను మళ్లీ వృద్ధి చేసే క్రమంలో భాగంగా మరో విడత వాటిని తీసుకురానున్నారు. ఈ సారి దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18న దేశానికి తీసుకు వస్తున్నారు. విధాత : దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను (చీతా) ఈ నెల 18న భారతదేశానికి తీసుకురానున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో 8 చీతాలు […]

భారత్‌కు మరో 12 చీతాలు.. ప్రపంచంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే..!

ఈ నెల 18న కునో జాతీయ పార్కుకు

దేశంలో అంతరించిపోయిన చిరుతలను మళ్లీ వృద్ధి చేసే క్రమంలో భాగంగా మరో విడత వాటిని తీసుకురానున్నారు. ఈ సారి దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18న దేశానికి తీసుకు వస్తున్నారు.

విధాత : దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను (చీతా) ఈ నెల 18న భారతదేశానికి తీసుకురానున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో 8 చీతాలు ఉన్నాయి.

ఇవి మూడు నాలుగు రోజులకు ఒక ప్రాణిని వేటాడుతున్నాయని, ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 17న నమీబియా నుంచి వచ్చాయి. ఇందులో ఐదు ఆడ పులులు, మూడు మగ పులులు ఉన్నాయి. వీటిలో ఒక ఆడ పులి క్రియాటినన్‌ లెవల్స్‌ పడిపోవడంతో అస్వస్థతకు గురైంది. అయితే.. తగిన చికిత్స అందించడంతో మళ్లీ కోలుకున్నది.

ఇకపై ఏటా 12 చీతాలు

తాజాగా భారత్‌కు చీతాలను రవాణా చేసేందుకు దక్షిణాఫ్రికాతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఎంవోయూ కుదుర్చుకున్నది. దీని ప్రకారం తాజాగా తెప్పించే 12 చీతాలు కాకుండా తదుపరి 8 నుంచి 12 ఏండ్లలో ఏటా 12 చొప్పున తెప్పించనున్నారు.

ఆ మూడు దేశాల్లోనే అత్యధిక చీతాలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు వేల చీతాల్లో అత్యధికం దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానాలోనే ఉన్నాయి. అందులోనూ నమీబియాలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. భారతదేశంలో 1948లోనే చీతాలు అంతరించి పోయాయి. ఆఖరి చీతా ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా సాల్‌ అటవీ ప్రాంతంలో 1948లో చనిపోయింది.