14. 03. 2023 మంగళవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి చోర బాధలు, శతృవులపై పైచేయి

మేష రాశి: విలువైన వస్తు నష్టములు కలుగవచ్చును. క్రీడాకారులకు శ్ర‌మ ఎక్కువగా వుంటుంది. నేత్ర బాధలు కలుగవచ్చును. నిరుత్సాహము ఆవహిస్తుంది. ధన వ్యయము ఎక్కువగా వుంటుంది. వృషభ రాశి: కళాకారులకు సన్మానది గౌరవములు లభిస్తాయి. కోపం వలన పనులు జరిపించుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ప్రయత్నకార్యాలు సిద్ధిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. మిథున రాశి: శతృవులతో విభేదాలు పరిష్కారమౌతాయి. ఆహ్లాదకర చర్చలలో పాల్గొంటారు. అధికారుల నుండి ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తాయి. దాన, ధర్మాది కార్యక్రమములు ఆనందాన్నిస్తాయి. కర్కాటక రాశి: […]

  • By: Somu    latest    Mar 14, 2023 12:59 AM IST
14. 03. 2023 మంగళవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి చోర బాధలు, శతృవులపై పైచేయి

మేష రాశి: విలువైన వస్తు నష్టములు కలుగవచ్చును. క్రీడాకారులకు శ్ర‌మ ఎక్కువగా వుంటుంది. నేత్ర బాధలు కలుగవచ్చును. నిరుత్సాహము ఆవహిస్తుంది. ధన వ్యయము ఎక్కువగా వుంటుంది.

వృషభ రాశి: కళాకారులకు సన్మానది గౌరవములు లభిస్తాయి. కోపం వలన పనులు జరిపించుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ప్రయత్నకార్యాలు సిద్ధిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

మిథున రాశి: శతృవులతో విభేదాలు పరిష్కారమౌతాయి. ఆహ్లాదకర చర్చలలో పాల్గొంటారు. అధికారుల నుండి ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తాయి. దాన, ధర్మాది కార్యక్రమములు ఆనందాన్నిస్తాయి.

కర్కాటక రాశి: సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. నూతన కార్యారంభము సంతోషాన్నిస్తుంది. సంతానములకంగా ఆనందాన్ని పొందుతారు. అపవాదులు తొలగిపోతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది.

సింహ రాశి: అధిక సంచారము మూలకంగా ఇబ్బంది పడతారు. తల్లిదండ్రుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వాములతో విభేదాలు ఏర్పడే అవకాశం వుంది. భోజన సౌఖ్యము తక్కువగా వుంటుంది.

కన్యా రాశి: దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య బాధలు ఉపశమిస్తాయి. పరోపకారముల వలన గౌరవ మర్యాదలు లభిస్తాయి. శతృ పరాజయంతో సంతోషంగా వుంటారు.

తులా రాశి: చోర బాధలు కలుగవచ్చును. వైద్యులను సంప్రదించవలసి రావచ్చును. సోదర వర్గముతో విభేదాలు బాధిస్తాయి. అనుకొని ఇబ్బందుల వలన మ‌నఃక్లేశ‌ము వుంటుంది.

వృశ్చిక రాశి: బంధుమిత్రుల మూలకుగా ఆనందంగా వుంటారు. మీ ఊహలు నిజమవుతాయి. శ్రేయోభిలాషులు సరైన మార్గదర్శనం చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆత్మస్థైర్యం లాభిస్తుంది.

ధనస్సు రాశి: ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శతృవులపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి వ్యవహారాలు లాభిస్తాయి. నష్టధ‌న ప్రాప్తి కలుగుతుంది.

మకర రాశి:– కోర్టు వ్యవహారాలు సానుకులంగా సాగుతాయి. పోలీసులకు వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభాకార్యాచరణము చేస్తారు. ధన ధాన్యసమృద్ది వుంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

కుంభ రాశి: ప్రముఖులతో కలయికలు లాభం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగా శ్రమకు తగిన గౌరవం లభిస్తుంది. ప్రయత్న కార్యాలు సిద్ధించడంతో ఆనందంగా వుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి.

మీన రాశి: నిరుత్సాహము తగదని గ్రహించండి. చేయవలసిన ప‌నులు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో విభేదాలు బాధిస్తాయి. దూరప్రయాణాలు చేయవలసి రావచ్చును. ధన వ్యయము ఎక్కువగా వుంటుంది.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.