బ‌ట్ట‌ల దుకాణంలోకి భారీ పాము.. 14 అడుగుల కొండ‌చిలువ‌ను చూసి షాక్‌

చిన్న పాము పిల్ల‌ను చూస్తేనే భ‌యంతో వ‌ణికిపోతాం. మ‌రి 14 అడుగుల పొడ‌వైన భారీ కొండ చిలువ మ‌న పైనే ఉన్న‌దంటే.. ఇక అంతే.. షాక్‌కు గురికావాల్సిందే.

బ‌ట్ట‌ల దుకాణంలోకి భారీ పాము.. 14 అడుగుల కొండ‌చిలువ‌ను చూసి షాక్‌
  • యూపీ మీరట్‌లోని రద్దీ మార్కెట్‌లో ఘ‌ట‌న‌
  • సోషల్ మీడియాలో పాము వీడియో హల్‌చల్


విధాత‌: చిన్న పాము పిల్ల‌ను చూస్తేనే భ‌యంతో వ‌ణికిపోతాం. మ‌రి 14 అడుగుల పొడ‌వైన భారీ కొండ చిలువ మ‌న పైనే ఉన్న‌దంటే.. ఇక అంతే.. షాక్‌కు గురికావాల్సిందే. సరిగ్గా అదే జ‌రిగింది ఉత్త‌రప్ర‌దేశ్‌లో. మీరట్‌లోని రద్దీ మార్కెట్‌లోని ఓ బట్టల దుకాణంలోకి 14 అడుగుల పొడవైన కొండచిలువ దూరింది.


షాపులో భారీ కొండచిలువ కనిపించడంతో షాపు యజమాని, దుకాణం లోపల ఉన్న ఇతర ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పామును చూసి షాపు బయటికి పరుగులు తీశారు. షాపులోని గుడ్డ ర్యాక్‌పై పాము తిరుగ‌డం వీడియోలో క‌నిపించింది. భారీ కొండచిలువ కనిపించడంతో రద్దీ మార్కెట్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న‌ది.