గ్రేటర్ వరంగల్: 1504 కొత్త మహిళా సంఘాల ఏర్పాటుకు చ‌ర్య‌లు: నగర మేయర్

విధాత, వరంగల్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిడబ్ల్యూఎంసీ పరిధిలో 1504 కొత్త మహిళా సంఘాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా ఉన్నత అధికారులతో కొత్త మహిళా సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ, ఇంటింటి నుండి తడి, పొడి చెత్త సేకరణ మహిళలకు అవగాహన, వీధి వ్యాపారులకు రుణాల మంజూరి తదితర అంశాలపై సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించ‌డానికి తగు […]

  • By: krs    latest    Dec 08, 2022 3:17 PM IST
గ్రేటర్ వరంగల్: 1504 కొత్త మహిళా సంఘాల ఏర్పాటుకు చ‌ర్య‌లు: నగర మేయర్

విధాత, వరంగల్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిడబ్ల్యూఎంసీ పరిధిలో 1504 కొత్త మహిళా సంఘాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.

బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా ఉన్నత అధికారులతో కొత్త మహిళా సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ, ఇంటింటి నుండి తడి, పొడి చెత్త సేకరణ మహిళలకు అవగాహన, వీధి వ్యాపారులకు రుణాల మంజూరి తదితర అంశాలపై సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించ‌డానికి తగు సూచనలు చేశారు.

ప్రస్తుతం ఉన్న 15,400 సంఘాలకు అదనంగా1504 కొత్త మహిళా సంఘాలను వచ్చే మార్చి 31 నాటికి ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు 73 సంఘాలు మాత్రమే ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో మహానగరానికి ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కృషిచేయాలన్నారు.

ఎస్ హెచ్ జి లకు బ్యాంక్ లింకేజీలపై సమీక్షిస్తూ గత సంవత్సరం 70 కోట్ల లక్ష్యం కాగా ప్రభుత్వం ఈ సంవత్సరం అదనంగా 35 కోట్ల పెంచగా మొత్తం 105 కోట్ల రూపాయల లక్ష్యాన్నిసాధించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 79 కోట్ల రూపాయలు సాధించామని, లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించాలని కోరారు.

పీఎం స్వనిధి కింద మొదటి విడతలో 29వేల వీధి వ్యాపారులకు 10 వేల రూపాయల మంజూరు చేయడం జరిగిందని, రెండో విడతలో 7500 విధి వ్యాపారులకు 20వేల చొప్పున రుణాల అందించి, అందులో 630 మంది రూ 50 వేల మంజూరుకు అర్హత సాధించారని తెలిపారు. అర్హత గల కొత్త వీధి వ్యాపారులను గుర్తించాలని మేయర్ సూచించారు.

సమావేశంలో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, సెక్రటరీ విజయలక్ష్మి, మెప్మా ప్రాజెక్ట్ అధికారి భద్రు నాయక్, డీఎంసీలు రజిత, రేణుక, టీఎంసీ రమేష్, సి ఓ లు తదితరులు పాల్గొన్నారు.