Janagama | జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

Janagama ఆగి ఉన్న లారీని ఢీకొన్న బొలెరో ఇద్దరు యువకులు మృతి మృతులు వరంగల్ నగర వాసులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ గేట్ వద్ద శనివారం ఉదయం బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం. వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన వడ్లకొండ రాకేష్, మరో వ్యక్తి బొలెరో వాహనంలో వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్నారు. […]

Janagama | జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

Janagama

  • ఆగి ఉన్న లారీని ఢీకొన్న బొలెరో
  • ఇద్దరు యువకులు మృతి
  • మృతులు వరంగల్ నగర వాసులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ గేట్ వద్ద శనివారం ఉదయం బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం. వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన వడ్లకొండ రాకేష్, మరో వ్యక్తి బొలెరో వాహనంలో వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో కోమల్ల టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొంది.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా, మృతులిద్దరూ హైద‌రాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న రఘునాథపల్లి ఎస్సై రఘుపతి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను జనగామ ఆసుపత్రికి తరలించారు. రాకేష్‌తో పాటు మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.