మరో ఇద్దరు ఎంపీలు సస్పెన్షన్..
లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు

న్యూఢిల్లీ : లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉభయసభల నుంచి సస్పెండ్‌కు గురైన ఎంపీల సంఖ్య 143కు చేరింది. ఎంపీల సస్పెన్షన్ గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడు కూడా ఎంపీలు సస్పెండ్ కాలేదు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటన చేయాలని విపక్ష పార్టీల ఎంపీలు గత వారం రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ నుంచి ఇప్పటి వరకు 97 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
తాజాగా కేరళ ఎంపీ థామస్ ఛజీకాదం, సీపీఐ(ఎం) ఎంపీ ఏఎం ఆరిఫ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ ఇద్దరు ఎంపీలు ఈ సెషన్ వరకు సస్పెండ్ అయ్యారు