20 నుండి ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్ యాత్రలు: రేవంత్ రెడ్డి

విధాత: రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ నెల 20 నుండి 24 వరకు హాత్ సే హాత్ జూడో యాత్రలు నిర్వహించాలని నిర్ణ‌యించిన‌ట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆదివారం సాయంత్రం జరిగిన హాత్ సే హాత్ జూడో అభియాన్ సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈనెల 20నుండి 24 వరకు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల […]

20 నుండి ‘హాత్ సే హాత్ జోడో’ అభియాన్ యాత్రలు: రేవంత్ రెడ్డి

విధాత: రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ నెల 20 నుండి 24 వరకు హాత్ సే హాత్ జూడో యాత్రలు నిర్వహించాలని నిర్ణ‌యించిన‌ట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆదివారం సాయంత్రం జరిగిన హాత్ సే హాత్ జూడో అభియాన్ సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఈనెల 20నుండి 24 వరకు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లా లని కేడర్ కు పిలుపునిచ్చారు.

సమావేశంలో ఎఐసిసి సెక్రెటరీ నదీమ్షా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కే. జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన తీరుగానే ఈ సమావేశానికి రేవంత్ వ్యతిరేక అసమ్మతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు.