America | అమెరికాలో స్కూల్లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులు స‌హా ఆరుగురు మృతి

America | అమెరికాలోని నాషివిల్లే( Nashville )లో దారుణం జ‌రిగింది. క్రిష్టియ‌న్ కొవెనంట్ స్కూల్లో( Covenant School ) ర‌క్త‌పుటేరులు పారాయి. స్కూల్లోకి ప్ర‌వేశించిన ఓ మ‌హిళ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్‌పై కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. స్కూల్ విద్యార్థులు, సిబ్బందిపై కాల్పుల‌కు పాల్ప‌డిన మ‌హిళ‌ను బ‌ల‌గాలు చుట్టుముట్టి మ‌ట్టుబెట్టాయి. ఆమె నుంచి రెండు రైఫిళ్లు, […]

America | అమెరికాలో స్కూల్లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులు స‌హా ఆరుగురు మృతి

America | అమెరికాలోని నాషివిల్లే( Nashville )లో దారుణం జ‌రిగింది. క్రిష్టియ‌న్ కొవెనంట్ స్కూల్లో( Covenant School ) ర‌క్త‌పుటేరులు పారాయి. స్కూల్లోకి ప్ర‌వేశించిన ఓ మ‌హిళ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్‌పై కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

కాల్పుల ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. స్కూల్ విద్యార్థులు, సిబ్బందిపై కాల్పుల‌కు పాల్ప‌డిన మ‌హిళ‌ను బ‌ల‌గాలు చుట్టుముట్టి మ‌ట్టుబెట్టాయి. ఆమె నుంచి రెండు రైఫిళ్లు, ఒక హ్యాండ్ గ‌న్‌( Handgun )ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల‌కు పాల్ప‌డిన మ‌హిళ వ‌య‌సు 28 ఏండ్లు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. ఆమె నాషివిల్లే ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగా నిర్ధారించారు. అయితే స్కూల్ విద్యార్థుల‌ను, సిబ్బందినే ఎందుకు టార్గెట్ చేసింద‌నే విష‌యం తెలియ‌రాలేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. కాల్పులు జ‌రిపిన స‌మ‌యంలో పాఠ‌శాల‌లో సుమారు 200 మంది విద్యార్థులు ఉన్నారు.