32 శాతం పెరిగిన గృహాల రిజిస్ట్రేషన్లు
విధాత: ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ మూడో క్వార్టర్ స్థిరాస్థి వివరాలను విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో గృహాల రిజిస్ట్రేషన్లు 32 శాతం పెరిగినట్లు వెల్లడించింది. రికార్డు స్థాయిలో నగరంలో 7,900 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికం. మూడో క్వార్టర్‌లో గృహాల ధరలు 6 శాతం పెరిగాయి. మూడో క్వార్టర్‌లో 8 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ క్రయ విక్రయాలు జరిగాయని […]

విధాత: ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ మూడో క్వార్టర్ స్థిరాస్థి వివరాలను విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో గృహాల రిజిస్ట్రేషన్లు 32 శాతం పెరిగినట్లు వెల్లడించింది. రికార్డు స్థాయిలో నగరంలో 7,900 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది.
ఇది గత ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికం. మూడో క్వార్టర్‌లో గృహాల ధరలు 6 శాతం పెరిగాయి. మూడో క్వార్టర్‌లో 8 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ క్రయ విక్రయాలు జరిగాయని పేర్కొన్నది. 33 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. చదరపు అడుగుపై వాణిజ్య రెంటల్ ధరలు 7 శాతం పెరిగాయి.