దసరాకు 3,500 ప్రత్యేక బస్సులు.. 24 నుంచి అందుబాటులోకి..!
విదాత: తెలంగాణ ప్రజలు దసరా పండుగను ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. పట్టణాల్లో ఉండే వారంతా ఈ పండుగకు తమ సొంతూర్లకు తప్పకుండా వెళ్తారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని రంగారెడ్డి రీజయన్ నుంచి దాదాపు […]

విదాత: తెలంగాణ ప్రజలు దసరా పండుగను ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. పట్టణాల్లో ఉండే వారంతా ఈ పండుగకు తమ సొంతూర్లకు తప్పకుండా వెళ్తారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని రంగారెడ్డి రీజయన్ నుంచి దాదాపు 3,500 ఆర్టీసీ బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మియాపూర్, కూకట్‌పల్లి, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్, కోఠి నుంచి దసరా స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక బస్సులకు సంబంధించిన వివరాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఆర్టీసీ రంగారెడ్డి ప్రాంత అధికారి శ్రీధర్ తెలిపారు