రాజగోపాల్ అనుచరుల ఖాతాల్లోకి రూ. నాలుగున్నర కోట్లు: TRS

Komatireddy Rajagopal Reddy | విధాత: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. అభిమానులకి షాకిచ్చిన బండ్ల గణేష్.. ఇక గుడ్ బై! నగదును నేరుగా పంపిణీ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గూగుల్ పే, ఫోన్ పే […]

  • Publish Date - October 30, 2022 / 04:55 AM IST

Komatireddy Rajagopal Reddy | విధాత: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.

అభిమానులకి షాకిచ్చిన బండ్ల గణేష్.. ఇక గుడ్ బై!

నగదును నేరుగా పంపిణీ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా తన అనుచరుల ఖాతాలకు భారీగా డబ్బును ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.

ఈ నగదు బదిలీ వ్యవహారాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి ఈ నెల 29వ తేదీన రూ. కోటి, 18వ తేదీన రూ. కోటిన్నర, 14వ తేదీన రూ. 2 కోట్ల నగదు బదిలీ చేసినట్లు ఆధారాలతో సహా టీఆర్ఎస్ బయట పెట్టింది.

రాజగోపాల్ రెడ్డి ప్రలోభాల వ్యవహారాన్ని ఆధారాలతో సహా,జిల్లా, రాష్ట్ర,కేంద్ర ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకుడు, రిటర్నింగ్ అధికారి,పోలీస్ అబ్జర్వర్,ఎన్నికల ఖర్చు అభ్జర్వర్ కు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు.

కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి – రూ. 16 లక్షలు
కే విజయవర్ధన్ రెడ్డి – రూ. 16 లక్షలు
కేఎస్ఆర్ ట్రేడింగ్ కంపెనీ – రూ. 16 లక్షలు
ఏ నవ్యశ్రీ – రూ. 16 లక్షలు
కే వెంకట రమణ – రూ. 16 లక్షలు
దిండు మహేశ్ – రూ. 16 లక్షలు
దిండు భాస్కర్ – రూ. 16 లక్షలు
పోలోజు రాజ్ కమల్ – రూ. 16 లక్షలు
దిండు యాదయ్య – రూ. 16 లక్షలు
శ్రీనివాస టెంట్ హౌజ్ – రూ. 16 లక్షలు
డీ దయాకర్ రెడ్డి – రూ. 16 లక్షలు
తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ – రూ. 16 లక్షలు
శివకుమార్ బుర్ర – రూ. 16 లక్షలు
ఉబ్బు సాయి కిరణ్ – రూ. 16 లక్షలు
మణికంఠ బిల్డింగ్ మెటిరీయల్ సప్లయర్స్ – రూ. 16 లక్షలు
టంగుటూరి లిఖిత – రూ. 16 లక్షలు
చింతల మేఘనాథ్ రెడ్డి – రూ. 40 లక్షలు

పిల్లలతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రన్నింగ్ రేస్

పబ్బు అరుణ – రూ. 50 లక్షలు
పబ్బు రాజు గౌడ్ – రూ. 50 లక్షలు
పబ్బు రాజు గౌడ్ – రూ. 50 లక్షలు

మేకల పారిజాత – రూ. 28 లక్షలు
నీల మహేశ్వర్ – రూ. 25 లక్షలు
అక్షయ సీడ్స్ పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్స్ – రూ. 25 లక్షలు.

అంతా ఫేక్‌.. ఖండించిన బీజేపీ

నిన్న కేటీఆర్ మునుగోడు ఓటర్లకు సుశీ ఇన్ఫ్రా సంస్థ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని ఈసికి ఫిర్యాదు చేస్తున్నట్టు విడుదల చేసిన పత్రాలన్నీ ఫేక్ అని.. దీన్ని ఖండిస్తూ ఆ సంస్థ ప్రకటించింది.
దాంట్లో ఉన్న వ్యక్తులకు గాని వారి అకౌంట్లకు గాని ఎటువంటి డబ్బు బదిలీ జరగలేదని వివరణ ఇచ్చింది. ఈ మేరకు కొంతమంది అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌ను మీడియాకు విడుదల చేసింది.

ఏపీలో గాలి అటు మళ్లుతోందా..?

మంత్రి అంబటి రాంబాబు.. మాములు ‘కళాకారుడు’ కాదండోయ్!