5G విప్లవం మొదలు..! ఇక జెట్ స్పీడ్‌తో ఇంటర్నెట్
విధాత: భారత్ ఇప్పుడు సాంకేతిక రంగంలో దూసుకుపోనుంది. ఇన్నాళ్లు 2జీ.. 3జీ.. 4జీ.. అంటూ మెల్లగా నడుస్తూ వచ్చిన మొబైల్ ఇంటర్నెట్ ఇప్పుడు ఇంకో జంప్ కొట్టి 5జీ స్థాయికి ఎదిగింది. దీంతో మొబైల్ ఫోన్లు రాఫెల్ జెట్ మాదిరిగా దూసుకుపోనున్నాయ్. ఇక ముందు నెట్ స్లోగా ఉందన్న మాటే ఉండదు. శనివారం దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. 5జీ సేవల సామర్థ్యాన్ని డెమోను రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మోడీకి వివరించారు. […]

విధాత: భారత్ ఇప్పుడు సాంకేతిక రంగంలో దూసుకుపోనుంది. ఇన్నాళ్లు 2జీ.. 3జీ.. 4జీ.. అంటూ మెల్లగా నడుస్తూ వచ్చిన మొబైల్ ఇంటర్నెట్ ఇప్పుడు ఇంకో జంప్ కొట్టి 5జీ స్థాయికి ఎదిగింది. దీంతో మొబైల్ ఫోన్లు రాఫెల్ జెట్ మాదిరిగా దూసుకుపోనున్నాయ్. ఇక ముందు నెట్ స్లోగా ఉందన్న మాటే ఉండదు. శనివారం దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.
5జీ సేవల సామర్థ్యాన్ని డెమోను రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మోడీకి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోడీ స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే అమెరికా చైనా దక్షిణ కొరియా ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఈ సేవలు కొన్ని పట్టణాలకే పరిమితమయ్యాయి.
మన దేశంలో తాజాగా మొదలైంది. దేశంలో మొదట్లో 5జీ సేవలను ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభించారు. వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. తొలి దశలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, ఫుణే నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో ప్రస్తుతం నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
మానవ జీవనంలో 5జీతో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది 4వ పారిశ్రామిక విప్లవంగా చెప్పొచ్చు. ఎంత పెద్ద సినిమానైనా 5జీ ఇంటర్నెట్ ఉంటే ఒక్క క్లిక్తో ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతరాయం లేకుండా గేమ్స్ ఆడవచ్చు. కృతిమ మేథ ఇంటర్నెట్ పర్చువల్ రియాల్టీ లాంటి ఆధునిక పరిజ్ఞానానికి 5జీ ఎంతో ఉపకరిస్తుంది.
ఆఫీసు నుంచే ఇంట్లోని పనులను ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు. ఇంటర్నెట్‌ను ప్రస్తుతం 4జీ స్పీడు కంటే 10 రెట్ల వేగంతో బ్రౌజ్ చేయవచ్చు. 4జీ ఫోన్లను 5జీలోకి మార్చుకోవడం సాధ్యమా? 4జీ ఫోన్లు ఉంటే 5జీలోకి మార్చలేదు. కొత్తగా 5జీ ఫోన్ కొనాల్సిందే. ఎందుకంటే 5జీలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ మోడెమ్ ప్రొసెసర్ వాడుతారు. సో 4జీని 5జీలోకి మార్చడం కుదరదు.