ఆ యూనివర్సిటీ ప్రెగ్నెంట్ స్టూడెంట్స్‌కు 60 రోజుల మెటర్నిటీ సెలవులు
విధాత: కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుకునే అమ్మాయిలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివాహం చేసుకుని చదువుకుంటున్న విద్యార్థినులకు మెటర్నరీ సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. 18 ఏండ్లు నిండిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. మెటర్నరీ సెలవులు 60 రోజుల పాటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ […]

విధాత: కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుకునే అమ్మాయిలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివాహం చేసుకుని చదువుకుంటున్న విద్యార్థినులకు మెటర్నరీ సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.
18 ఏండ్లు నిండిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. మెటర్నరీ సెలవులు 60 రోజుల పాటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఒకే ఒక్క ప్రెగ్నెన్సీకి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. మెటర్నరీ సెలవు తీసుకునే వారు తప్పనిసరిగా సంబంధిత డాక్టర్‌తో ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినట్లు సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. అబార్షన్ లేదా ట్యూబెక్టమీ కేసుల్లో 14 రోజుల లీవ్ ఇవ్వనున్నట్లు వర్సిటీ రిపోర్ట్ పేర్కొన్నది.