నేషనల్ పోలీసు అకాడమీలో 8 కంప్యూటర్లు చోరీ
విధాత: ప్రతీ క్షణం పోలీసుల నిఘాలో ఉండే నేషనల్ పోలీసు అకాడమీలోనే చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో భద్రతా బలగాల కళ్లుగప్పి 8 కంప్యూటర్లను దొంగిలించిన విషయం వెలుగు చూసింది. అయితే కంప్యూటర్లు మాయం కావడంతో రాజేంద్ర నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు అకాడమీలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగే కంప్యూటర్లను దొంగిలించినట్లు […]

విధాత: ప్రతీ క్షణం పోలీసుల నిఘాలో ఉండే నేషనల్ పోలీసు అకాడమీలోనే చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో భద్రతా బలగాల కళ్లుగప్పి 8 కంప్యూటర్లను దొంగిలించిన విషయం వెలుగు చూసింది.
అయితే కంప్యూటర్లు మాయం కావడంతో రాజేంద్ర నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసు అకాడమీలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగే కంప్యూటర్లను దొంగిలించినట్లు తేలింది. నిందితుడిని ఐటీ సెక్షన్‌లో పని చేస్తున్న చంద్రశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు