ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి

- ఘాతుకానికి పాల్పడిన మేనమామ
విధాత: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకున్నది. అమేథి జిల్లాలో ఎనిమిదేండ్ల బాలికపై మేనమామే లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలికను ఆమె మేనమామ బంధువుల ఫంక్షన్‌కు బాలికను తీసుకెళ్లాడు. అక్కడ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన బాధితురాలి కుటుంబ సభ్యులు జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు.
తనపై జరిగిన దారుణాన్ని ఆమె తల్లిదండ్రులకు వివరించింది. బాలికతో కలిసి వెళ్లి సంగ్రామ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీరామ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.