9th class | 78 ఏండ్ల వయసులో.. 9వ తరగతిలో చేరిన వృద్ధుడు!
9th class ఈ ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలలో ప్రవేశం పాఠశాల కోసం రోజు మూడు కి.మీ నడక స్ఫూర్తిదాయకంగా మిజోరాం వృద్ధుడి గాధ స్కూల్ యూనిఫాంలో ఉన్న ఫొటోలు వైరల్ విధాత: అందరు పిల్లల మాదిరిగా ఆ బాలుడు పాఠశాలకు వెళ్లాడు. బాగా చదువుకోవాలని కలలు కన్నాడు. కానీ తండ్రి చనిపోవడంతో కుటుంబం భారం తల్లిపై పడింది. ఆమెకు చేదోడుగా ఉండేందుకు ఆ బాలుడు చదువు మానాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదరికం కారణంగా బడి దూరమై.. వ్యవసాయమే […]

9th class
- ఈ ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలలో ప్రవేశం
- పాఠశాల కోసం రోజు మూడు కి.మీ నడక
- స్ఫూర్తిదాయకంగా మిజోరాం వృద్ధుడి గాధ
- స్కూల్ యూనిఫాంలో ఉన్న ఫొటోలు వైరల్
విధాత: అందరు పిల్లల మాదిరిగా ఆ బాలుడు పాఠశాలకు వెళ్లాడు. బాగా చదువుకోవాలని కలలు కన్నాడు. కానీ తండ్రి చనిపోవడంతో కుటుంబం భారం తల్లిపై పడింది. ఆమెకు చేదోడుగా ఉండేందుకు ఆ బాలుడు చదువు మానాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదరికం కారణంగా బడి దూరమై.. వ్యవసాయమే బతుకు దెరువైంది. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇప్పుడు ఆయనకు 78 ఏండ్లు.
అయినా చదువు కోవాలనే కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇంగ్లీషు భాషను మెరుగుపరుచు కోవాలని అనుకున్నాడు. ఇంగ్లీష్ లోనే దరఖాస్తులు రాయడం, ఆంగ్ల వార్తలను అర్ధం చేసుకోవడం తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకు పాఠశాలకు వెళ్లడమే సరైన మార్గమని భావించాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో తొమ్మిదో తరగతిలో సమీప పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఆయనే మిజోరాం-మయన్మార్ సరిహద్దులోని హ్రుహైకన్ గ్రామానికి చెందిన 78 ఏండ్ల లాల్‌రింగ్ధరా. పాఠశాల యాజమాన్యం అయనకు పుస్తకాలు, యూనిఫాం ఇచ్చింది.
యూనిఫాం ధరించి రోజు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు. ఇందుకు సంబం ధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జ్ఞాన సముపార్జనకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించిన లాల్‌రింగ్ధరా తెగువను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.