Wife harass | న‌ల్ల‌గా ఉన్నాడంటూ భార్య‌ వేధింపులు.. విడాకులు కోరిన మొగుడు

Wife harass | ప్రేమించే మ‌న‌సు ఉంటే చాలు.. శ‌రీర వ‌ర్ణం అడ్డంకి కానే కాదు. కానీ ఓ జంట మ‌ధ్య ఆ వ‌ర్ణ‌మే విడాకులు తీసుకునేలా చేసింది. న‌ల్ల‌గా ఉన్నాడంటూ నిత్యం భ‌ర్త‌ను వేధింపుల‌కు గురి చేయ‌గా, భ‌రించ‌లేక భార్య‌ను వ‌దులుకున్న ఓ మొగుడి వ్య‌థ ఇది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరుకు చెందిన ఓ జంట‌కు 2007లో పెళ్లైంది. ఓ మూడేండ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగా సాగిపోయింది. అయితే భ‌ర్త […]

Wife harass | న‌ల్ల‌గా ఉన్నాడంటూ భార్య‌ వేధింపులు.. విడాకులు కోరిన మొగుడు

Wife harass | ప్రేమించే మ‌న‌సు ఉంటే చాలు.. శ‌రీర వ‌ర్ణం అడ్డంకి కానే కాదు. కానీ ఓ జంట మ‌ధ్య ఆ వ‌ర్ణ‌మే విడాకులు తీసుకునేలా చేసింది. న‌ల్ల‌గా ఉన్నాడంటూ నిత్యం భ‌ర్త‌ను వేధింపుల‌కు గురి చేయ‌గా, భ‌రించ‌లేక భార్య‌ను వ‌దులుకున్న ఓ మొగుడి వ్య‌థ ఇది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరుకు చెందిన ఓ జంట‌కు 2007లో పెళ్లైంది. ఓ మూడేండ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగా సాగిపోయింది. అయితే భ‌ర్త న‌ల్ల‌గా ఉండ‌టంతో అత‌న్ని భార్య నిత్యం వేధింపుల‌కు గురి చేసేది. దీంతో భార్య వేధింపులు భ‌రించ‌లేని భ‌ర్త త‌న‌కు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కాడు.

తాను న‌ల్ల‌గా ఉంటాన‌ని భార్య నిత్యం వేధిస్తోంద‌ని, మ‌రో యువ‌తితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని ఆరోపిస్తూ, పుట్టింటికి వెళ్లిపోయింద‌ని న్యాయ‌స్థానానికి బాధితుడు వివ‌రించాడు. మూడేండ్లు మాత్ర‌మే త‌న‌తో త‌న భార్య ఉంద‌ని, ఆ త‌ర్వాత పుట్టింటికి వెళ్లిపోయింద‌ని కోర్టుకు తెలిపాడు.

బాధితుడి త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న న్యాయ‌స్థానం విడాకులు మంజూరు చేసింది. శ‌రీర వ‌ర్ణాన్ని అడ్డుపెట్టుకుని ఈస‌డించుకోవ‌డం క్రౌర్యం కింద‌కే వ‌స్తుంద‌ని న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.