స్మార్ట్ ఫోన్ వాడొద్దన్నందుకు.. భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
Smart Phone | స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. నిత్యం స్మార్ట్ ఫోన్లలోనే పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దల వరకు మునిగి తేలుతున్నారు. కంటి నిండా కునుకు తీయకుండా.. ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌కు బానిస అయిన ఓ నవ వధువును ఫోన్ వాడొద్దన్నందుకు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ చింతల్‌లోని శ్రీసాయి కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన జనార్ధన్ రెడ్డి, […]

Smart Phone | స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. నిత్యం స్మార్ట్ ఫోన్లలోనే పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దల వరకు మునిగి తేలుతున్నారు. కంటి నిండా కునుకు తీయకుండా.. ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌కు బానిస అయిన ఓ నవ వధువును ఫోన్ వాడొద్దన్నందుకు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ చింతల్‌లోని శ్రీసాయి కాలనీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన జనార్ధన్ రెడ్డి, కమల దంపతుల కుమార్తె శైలు(20)కు పులివెందులకు చెందిన ఓబుల్ రెడ్డి కుమారుడు గంగా ప్రసాద్ రెడ్డికి ఈ ఏడాది అక్టోబర్‌లో వివాహం జరిగింది. ఈ నవ దంపతులు చింతల్‌లో కాపురం పెట్టారు. అయితే శైలు పెళ్లికి ముందే స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం గడిపేది. రీల్స్ చేస్తూ కాలక్షేపం చేసేది. పెళ్లి చేస్తే వీటన్నింటికి దూరంగా ఉంటుందని భావించి, శైలుకు వివాహం జరిపించారు. అయినప్పటికీ శైలు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఫోనే ప్రపంచమని భావించింది. వీడియో రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలోనే గడిపేస్తోంది. దీంతో భర్త పలుమార్లు హెచ్చరించాడు.
ఇదే విషయంపై వారం రోజుల కిందట భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. శైలు ఫోన్ పాస్ వర్డ్ చేంజ్ చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆమె.. ఫోన్ పాస్ వర్డ్ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. చేసేదేమీ లేక శైలు వ్యవహారాన్ని ఆమె తల్లిదండ్రులకు గంగాప్రసాద్ రెడ్డి తెలిపాడు. ఫోన్‌లో కూతురికి నచ్చజెప్పేందుకు యత్నించారు. తల్లి కూడా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. గురువారం తెల్లవారుజామున శైలు తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.