దొంగత‌నం చేశాడ‌ని అమానుషం.. కట్టేసి దారుణంగా కొట్టిన గ్రామ‌స్థులు

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది

దొంగత‌నం చేశాడ‌ని అమానుషం.. కట్టేసి దారుణంగా కొట్టిన గ్రామ‌స్థులు
  • యువకుడిని చెట్టుకు తలకిందులుగా
  • ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఘ‌ట‌న‌



విధాత‌: ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ అమానవీయ చర్యను ప‌లువురు కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైరల్‌గా మారింది. కొంతమంది క‌లిసి యువ‌కుడిని దారుణంగా కొట్టడం, కండ్ల‌లో కార‌డం చ‌ల్ల‌డం వీడియోలో క‌నిపిస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో నిందితులైన న‌లుగురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.


డ్రమ్మండ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకున్న‌ది. జైశంకర్ బహేలియా అనే యువ‌కుడిని దొంగతనం చేశాడ‌నే అనుమానంతో పట్టుకుని చెట్టుకు తలకిందులుగా కట్టివేసి, దారుణంగా కొట్టాడు. అతని శరీరానికి కారం పొడిని కూడా రాసి అతనిని తీవ్రంగా హింసించారు. అతని చేయి విర‌గొట్టారు.


కాగా.. త‌న‌కు చోరీతో సంబంధం లేద‌ని, త‌నను వ‌ద‌లిపెట్టాల‌ని జైశంక‌ర్ చేతులు జోడించి బ‌తిమిలాడినా కనిక‌రించ‌లేదు. గ్రామ‌స్థులు కూడా ఈ తతంగాన్ని సినిమాలా చూశారు త‌ప్ప ఎవ‌రూ అడ్డుకోలేదు. ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గానే ఈ దారుణం చోటుచేసుకున్న‌ది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని రాజేష్ ధైకర్‌గా పోలీసులు గుర్తించారు. రాజేశ్‌ ధైకర్ మ‌రికొంద‌రు యువ‌కుల‌తో క‌లిసి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు.