Girl Friend | దూరం పెట్టిందన్న కోపంతో.. గర్ల్‌ఫ్రెండ్ ప్రైవేటు భాగాల్లో కారం పొడితో దాడి
Girl Friend | ఓ వివాహితుడు దారుణానికి పాల్పడ్డాడు. తనకు పెళ్లైందన్న విషయం దాచి.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. అతడికి పెళ్లైందన్న విషయం తెలిసీ.. ఆమె అతన్ని దూరం పెట్టింది. దీంతో అతనిలో ఉన్న క్రూర మృగం బయటకు వచ్చింది. గర్ల్ ఫ్రెండ్‌పై అత్యాచారం చేసి, ప్రయివేటు భాగాల్లో కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన నికుంజ్ కుమార్ […]

Girl Friend | ఓ వివాహితుడు దారుణానికి పాల్పడ్డాడు. తనకు పెళ్లైందన్న విషయం దాచి.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. అతడికి పెళ్లైందన్న విషయం తెలిసీ.. ఆమె అతన్ని దూరం పెట్టింది. దీంతో అతనిలో ఉన్న క్రూర మృగం బయటకు వచ్చింది. గర్ల్ ఫ్రెండ్‌పై అత్యాచారం చేసి, ప్రయివేటు భాగాల్లో కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన నికుంజ్ కుమార్ అమృత్ భాయ్ పటేల్‌కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. కానీ భార్య పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో మరో అమ్మాయితో పటేల్ పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే తనకు పెళ్లైన విషయాన్ని గర్ల్ ఫ్రెండ్ వద్ద దాచాడు పటేల్. ఇటీవలే ఆమెకు విషయం తెలియడంతో నిలదీసింది. అతన్ని దూరంగా పెట్టింది.
తనను దూరంగా పెట్టడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన పటేల్.. గర్ల్ ఫ్రెండ్‌ను బంధించి, ఆమెపై అత్యాచారం చేశారు. ఛార్జింగ్ వైర్‌తో చితకబాదాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రయివేటు భాగాల్లో కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషయం బయటకు చెబితే.. నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు ఆస్పత్రిలో చేరడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నాడు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.