క్ష‌ణం ఆల‌స్య‌మైతే ప్రాణం పోయేది..!

రైలు ఎక్కే క్ర‌మంలో కింద‌ప‌డిపోతున్న‌ వృద్ధురాలిని రైల్వే కానిస్టేబుల్‌ వేగంగా స్పందించ‌డం ర‌క్షించడంతో ప్రాణాలు ద‌క్కాయి.

క్ష‌ణం ఆల‌స్య‌మైతే ప్రాణం పోయేది..!
  • వృద్ధురాలిని ర‌క్షించిన‌ రైల్వే కానిస్టేబుల్‌
  • యూపీలోని గోండా రైల్వే స్టేషన్‌లో ఘ‌ట‌న‌
  • స్టేష‌న్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఘ‌ట‌న రికార్డు


విధాత‌: రైలు ఎక్కే క్ర‌మంలో కింద‌ప‌డిపోతున్న‌ వృద్ధురాలిని రైల్వే కానిస్టేబుల్‌ వేగంగా స్పందించ‌డం ర‌క్షించడంతో ప్రాణాలు ద‌క్కాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్‌లో బుధ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. స్టేష‌న్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ‌యిన ఈ ఘ‌ట‌న వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ కావ‌డంతో కానిస్టేబుల్‌ స‌మ‌య‌స్ఫూర్తిని నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు.


గోండా రైల్వే స్టేషన్‌లో గోర‌క్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ఓ వృద్ధురాలు ప్ర‌య‌త్నించి కిందికి జారిపోయింది. రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోయింది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్ రామ్‌సుంద‌ర్ జైశ్వార్ క్ష‌ణాల్లో స్పందించారు. వృద్ధురాలి వైపు పరుగెత్తి రెండు చేతులు, న‌డుము ప‌ట్టుకుని ప్లాట్‌ఫార‌మ్‌పైకి లాగారు. వృద్ధ‌ ప్రయాణికురాలిని రక్షించారు. ఆయ‌న‌ ఇత‌రులు స‌హాయం అందించారు. మహిళ క్షేమంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.