రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

విధాత, మెదక్ బ్యూరో: నగర శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్‌కు చెందిన ఉపాధ్యాయుడు పెద్దోళ్ల పెంటయ్య మృతి చెందారు. ప‌ట్టణంలోని సాయి నగర్ కాలనీకి చెందిన పెంటయ్య మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. అత‌ని భార్య కూడా చిన్న శంకరంపేట మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మెదక్ మండలం రాజ్ పల్లి నుండి మెదక్ ప‌ట్ట‌ణానికి […]

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

విధాత, మెదక్ బ్యూరో: నగర శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్‌కు చెందిన ఉపాధ్యాయుడు పెద్దోళ్ల పెంటయ్య మృతి చెందారు. ప‌ట్టణంలోని సాయి నగర్ కాలనీకి చెందిన పెంటయ్య మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం తిమ్మాయపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. అత‌ని భార్య కూడా చిన్న శంకరంపేట మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మెదక్ మండలం రాజ్ పల్లి నుండి మెదక్ ప‌ట్ట‌ణానికి వచ్చి సాయినగర్ కాలనీలో భార్యాభర్తలు, పిల్లలు నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌కు పనిమీద వెళ్లిన క్ర‌మంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం పలువురిని కంట తడి పెట్టించింది. భార్య, పిల్లల రోదన చూపరుల హృదయాల్ని కదిలించింది..

సాయి నగర్ లో విషాద ఛాయలు…

పెంటయ్య‌ మృతితో సాయినగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయ సంఘాల నేతలు మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కరుణాకర్, వెంకటేశం, నాగభూషణం, సత్యనారాయణ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.