వివాహేతర సంబంధం: భర్తను హత్య చేయించిన భార్య

రూ.4 లక్షల సుపారి భార్యతో సహా మరో ముగ్గురు నిందితుల అరెస్టు ఒక కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం విధాత, వరంగల్: భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సుపారీ ఇచ్చి హత్య చేయించి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలో నిందితులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో మృతుడి భార్యతో పాటు హత్యలో భాగస్వామ్యమైన మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, నాలుగు సెల్ […]

వివాహేతర సంబంధం: భర్తను హత్య చేయించిన భార్య
  • రూ.4 లక్షల సుపారి
  • భార్యతో సహా మరో ముగ్గురు నిందితుల అరెస్టు
  • ఒక కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం

విధాత, వరంగల్: భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సుపారీ ఇచ్చి హత్య చేయించి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలో నిందితులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో మృతుడి భార్యతో పాటు హత్యలో భాగస్వామ్యమైన మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడి మొద‌టి భార సుష్మిత ప్ర‌ధాన నిందితురాలు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ఫోటోగ్రాఫర్, ప్రస్తుతం సికింద్రాబాద్ విద్యానగర్ లో నివసిస్తున్న అనిల్(30), జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇస్సిపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్ (31) ప్రస్తుతం హనుమకొండ సప్తగిరి కాలనీలోడైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కారు డ్రైవర్ గా పనిచేసే కటిక నవీన్ (25) హత్య కేసులో నిందితులుగా ఉన్నారు

డీసీపీ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు జన్నారపు వేణు కుమార్ చిట్టీలు గిరి గిరిలు నిర్వహిస్తూ కాజీపేట లోని డీజిల్ కాలనీలో నివాసం వుంటున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు ప్రధాన నిందితురాలైన మొదటి భార్య జన్నారపు సుష్మిత కాజీపేట రైల్వే ఎంప్లాయిగా పనిచేస్తోంది. రెండవ భార్య సంతోష ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది. మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, రెండవ భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు. వీరందరూ డీజిల్ కాలనీలోనే నివాసం ఉండేవారు.

గత కొద్ది రోజులుగా మృతుడు వేణు కుమార్ మహబూబాబాద్ లో మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారంతో నిందితురాలైన మొదటి భార్య సుస్మిత మృతుడు మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. అయినా మృతుడు మహబూబాద్ కు చెందిన అమ్మాయిలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే తన ఇద్దరు భార్యలను మానసికంగా శారీకంగా హింసిస్తూ దూరం పెట్టేవాడు.

తన భర్తకు బుద్ధి చెప్పాలని నిందితురాలైన మొదటి భార్య సంతోష నిర్ణయించుకుంది. ఇందుకుగాను నిందితురాలికి సమీప బంధువైన మరో నిందితుడు కొంగర అనిల్ కు విషయం తెలియజేసింది. నిందితుడు అనిల్ తనకు పరిచయం ఉన్న మరో ఇద్దరు నిందితులైన గడ్డం రత్నాకర్, కటిక నవీన్ సాయంతో మృతుడు రాజ్ కుమార్ ను హత్య చేయించేందుకు పన్నాగం పన్నాడు.

హత్య కోసం గడ్డం రత్నాకర్ 4 లక్షల రూపాయలు ఒప్పందం చేసుకొని రెండు లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. హత్య పథకంలో భాగంగా గత సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి సమయంలో ప్రధాన నిందితురాలైన మొదటి భార్య సుస్మిత మృతుడు రాజ్ కుమార్ కు నిద్ర మాత్రలు కలిపిన పాయసం తినిపించడంతో రాజ్ కుమార్ స్పృహ కోల్పోయాడు. విష‌యాన్ని నిందితురాలు మిగతా నిందితులైన రత్నాకర్, అనిల్ లకు సమాచారం చేరవేసింది. మృతుడి ఇంటికి చేరుకున్న నిందితులు స్పృహలేని వేణుకుమార్ ను కొంగర అనిల్ గడ్డం రత్నాకర్ ఇరువురు గొంతు నులిమి హత్య చేశారు.

హత్య అనంతరం బెడ్ షీట్స్ లో చుట్టిన వేణు కుమార్ మృతదేహాన్ని నిందితులు కారులో తీసుకొని భూపాల్ పల్లి జిల్లా మంథని గ్రామంలో ప్రవహిస్తున్న మానేరు నదిలో పడేవేసి తిరిగి కారులో వరంగల్ కు చేరుకున్నారు. తన భర్త కనబడటం లేదు అని కాజీపేటలో పోలీస్ స్టేషన్లో సుస్మిత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న కాజీపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫిర్యాదు చేసిన మొదటి భార్య పై పోలీసులకు అనుమానం రావడంతో విచారించ‌గా పోలీస్‌ల ముందు లొంగిపోయి తాను చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈమె ఇచ్చిన వాంగ్మూలం తో మిగతా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

వారిచ్చిన సమాచారం మేరకు మంథని పోలీసుల సహకారంతో మానేరులో పడి ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేశారు. అనంత‌రం స్థానిక తహసిల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని మృతుని బంధువులకు అప్పగించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని డిసిపి అశోక్ కుమార్ వెల్లడించారు.

ఈ హత్యను ఛేదించిన సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్, కాజీపేట్ ACP శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ G.మహేందర్ రెడ్డి, కాజీపేట్ఎ స్‌ఐ లు ప్రమోద్ కుమార్, రవికుమార్, వెంకటేశ్వర్లు, సల్మాన్ పాషా ఏ‌ఏ‌ఓ, పి‌సి లు భాస్కర్, మధు, శ్రీనివాస్, వేణు, సతీష్ రెడ్డి మరియు రమేశ్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ అభినందించారు.