మహబూబ్‌నగర్‌లో కలకలం.. స్వామిజీకి న్యూడ్ ఫోటోలు పంపితే డబ్బులొస్తాయని ప్రచారం
Mahabubnagar | మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలో న్యూడ్ ఫోటోల వ్యవహారం కలకలం రేపుతోంది. నగ్న చిత్రాలను ఓ స్వామిజీకి పంపిస్తే, డబ్బులు వస్తాయని కొందరు దుండగులు స్థానిక మహిళలను నమ్మబలికారు. దుండగుల మాటలు నమ్మిన మహిళలు.. డబ్బుకు ఆశపడి ఆ స్వామిజీకి నగ్న ఫోటోలు పంపారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల పాత బజార్‌కు చెందిన జైనుల ఉద్దీన్ అనే వ్యక్తి.. స్థానికంగా ఉన్న ఓ మహిళ […]

Mahabubnagar | మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలో న్యూడ్ ఫోటోల వ్యవహారం కలకలం రేపుతోంది. నగ్న చిత్రాలను ఓ స్వామిజీకి పంపిస్తే, డబ్బులు వస్తాయని కొందరు దుండగులు స్థానిక మహిళలను నమ్మబలికారు.
దుండగుల మాటలు నమ్మిన మహిళలు.. డబ్బుకు ఆశపడి ఆ స్వామిజీకి నగ్న ఫోటోలు పంపారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల పాత బజార్‌కు చెందిన జైనుల ఉద్దీన్ అనే వ్యక్తి.. స్థానికంగా ఉన్న ఓ మహిళ ఇంటికి ఫిబ్రవరి 18వ తేదీన రాత్రి 10 గంటలకు వెళ్లాడు. నగ్న ఫోటోలను ఓ స్వామిజీకి పంపితే డబ్బులు వస్తాయని ఆమెను నమ్మించాడు ఉద్దీన్.
అనంతరం ఆమె శరీరాకృతికి సంబంధించి 50 ఫోటోలను తీసుకున్నాడు. అనంతరం ఉద్దీన్ వెళ్లిపోయాడు. రెండు రోజులు గడిచినప్పటికీ, డబ్బులు రాకపోవడంతో.. తాను మోసపోయానని బాధిత మహిళ గుర్తించింది. దీంతో ఫిబ్రవరి 20వ తేదీన జడ్చర్ల పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.