Crocodile | భర్తను కాపాడుకునేందుకు మొసలితో భార్య వీరోచిత పోరాటం
Crocodile | మొసలి నోటికి చిక్కిన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ వీరోచిత పోరాటం చేసింది. మొసలి తలపై కర్రతో బాది.. తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటన రాజస్థాన్( Rajasthan ) కరౌలీ జిల్లాలోని మండరాయల్ సబ్ డివిజన్లో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండరాయల్ సబ్ డివిజన్‌కు చెందిన బనీసింగ్ మీనా(29), ఆయన భార్య విమలాబాయి కలిసి మేకలను మేపేందుకు వెళ్లారు. అయితే బనీసింగ్కు దాహం వేయడంతో […]

Crocodile | మొసలి నోటికి చిక్కిన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ వీరోచిత పోరాటం చేసింది. మొసలి తలపై కర్రతో బాది.. తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటన రాజస్థాన్( Rajasthan ) కరౌలీ జిల్లాలోని మండరాయల్ సబ్ డివిజన్లో మంగళవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మండరాయల్ సబ్ డివిజన్‌కు చెందిన బనీసింగ్ మీనా(29), ఆయన భార్య విమలాబాయి కలిసి మేకలను మేపేందుకు వెళ్లారు. అయితే బనీసింగ్కు దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్లాడు.
నదిలో కాళ్లు పెట్టి దోసిలితో నీళ్లు తాగుతుండగా, ఓ మొసలి బనీసింగ్ కాళ్లను పట్టేసింది. దీంతో గట్టిగా కేకలు వేశాడు అతను. సమీపంలో ఉన్న భార్య విమలాబాయి అప్రమత్తమై నది వద్దకు చేరుకుంది. మొసలి నోట్లో భర్త కాలు ఉండటం చూసి ఆమె అప్రమత్తమైంది.
తన వద్ద ఉన్న కర్రతో మొసలి తలపై తీవ్రంగా బాదింది. దీంతో బనీసింగ్ కాలును వదిలేసి మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారంతా కలిసి.. బనీసింగ్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. బనీసింగ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలుసని, ఆ క్షణంలో తన భర్తను కాపాడుకోవడం ఒక్కటే లక్ష్యం కావడంతో భయం వేయలేదని విమలాబాయి తెలిపింది. ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమలాబాయి సాహసంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.