పేలిన ఎస్ఐ తుపాకీ.. మ‌హిళ త‌ల‌లోకి దూసుకెళ్లిన తూటా

పొర‌పాటున ఓ ఎస్ఐ తుపాకీ పేల‌డంతో.. అత‌ని ముందున్న మ‌హిళ త‌ల‌లోకి తూటా దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీఘ‌ర్‌లో చోటు చేసుకుంది

పేలిన ఎస్ఐ తుపాకీ.. మ‌హిళ త‌ల‌లోకి దూసుకెళ్లిన తూటా

ల‌క్నో: పొర‌పాటున ఓ ఎస్ఐ తుపాకీ పేల‌డంతో.. అత‌ని ముందున్న మ‌హిళ త‌ల‌లోకి తూటా దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీఘ‌ర్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. అలీఘ‌ర్‌కు చెందిన ఇష్ర‌త్ అనే మ‌హిళ పాస్ పోర్టు వెరిఫికేష‌న్ నిమిత్తం నిన్న మ‌ధ్యాహ్నం 2:50 గంట‌ల స‌మ‌యంలో స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లింది.