గుజరాత్: బీజేపీలోకి.. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు?
అదే జరిగితే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే విధాత: గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలే గెలిచినా..12.92 శాతం ఓటు బ్యాంకు సాధించింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, గోవాలో 6.77 శాతం , ఉత్తరాఖండ్‌లో 3.31 శాతం ఓట్లు తెచ్చుకున్నది. తాజాగా గుజరాత్త్‌లో సాధించిన ఓట్లతో ఆప్ జాతీయ పార్టీ హోదా పొందే అవకాశాన్ని దక్కించుకున్నది. అయితే గుజరాత్‌లో ప్రభుత్వం కొలువు తీరకముందే ఆప్ తరఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ లోకి […]

- అదే జరిగితే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే
విధాత: గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలే గెలిచినా..12.92 శాతం ఓటు బ్యాంకు సాధించింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, గోవాలో 6.77 శాతం , ఉత్తరాఖండ్‌లో 3.31 శాతం ఓట్లు తెచ్చుకున్నది. తాజాగా గుజరాత్త్‌లో సాధించిన ఓట్లతో ఆప్ జాతీయ పార్టీ హోదా పొందే అవకాశాన్ని దక్కించుకున్నది.
అయితే గుజరాత్‌లో ప్రభుత్వం కొలువు తీరకముందే ఆప్ తరఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ లోకి జంప్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. ఆప్ సింబల్‌పై గెలిచిన వారిలో ముగ్గురు బీజేపీ నుంచి ఎన్నికలకు ముందు ఆ పార్టీలోకి వచ్చిన వారే. వారికి బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆప్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన ముగ్గురు అభ్యర్థులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు
ఇదిలాఉండగా ఇప్పటికే ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు.. ప్రజాభిప్రాయం తెలుసుకుని బీజేపీలో చేరికపై నిర్ణయం వెల్లడించనున్నట్లు స్ఫష్టం చేశారు. ఇప్పుడు కనుక ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ వీడితే కేజ్రీవాల్‌కు కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ బలహీన పడిందని ఆ పార్టీకి ప్రత్యామ్నయంగా ఆప్ వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తున్నదని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు చేజారితే కాంగ్రెస్‌కు లాభం చేకూరనుంది.
ఎన్నికల్లో ప్రభుత్వ ఓటు బ్యాంకును చీల్చి కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టి కమలం పార్టీ భారీ సీట్లు దక్కించుకోవడానికి దోహదపడింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కాషాయ గూటికి చేరితే ఆప్ ఆశలకు అడ్డుకట్ట పడుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది.
2023లో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ముఖాముఖి పోరు జరుగుతుంది. అక్కడ ఆప్ పోటీ చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి ఇక ఉండదు. గుజరాత్ ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే అది ఆప్‌కే గుదిబండ కానున్నది.