ED, CBI | ప్రతి గల్లీకీ ఈడీ, సీబీఐ శాఖలు పెట్టండి: ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌

విధాత : విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఈడీ నోటీసులు ఇస్తున్నదని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ (AAP MP Sanjay Singh) విమర్శించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ (ED) నోటీసులపై ఆయన స్పందించారు. ప్రశ్నించిన వారిపై బీజేపీ (BJP) పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలకు బడ్జెట్‌ పెంచండి అని, గల్లి గల్లికి ఈడీ, సీబీఐ శాఖలు పెట్టి అరెస్టులు చేయండని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం బీజేపీకి అవసరం లేదన్నారు.

  • By: Somu    latest    Mar 08, 2023 10:26 AM IST
ED, CBI | ప్రతి గల్లీకీ ఈడీ, సీబీఐ శాఖలు పెట్టండి: ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌

విధాత : విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఈడీ నోటీసులు ఇస్తున్నదని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ (AAP MP Sanjay Singh) విమర్శించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ (ED) నోటీసులపై ఆయన స్పందించారు.

ప్రశ్నించిన వారిపై బీజేపీ (BJP) పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలకు బడ్జెట్‌ పెంచండి అని, గల్లి గల్లికి ఈడీ, సీబీఐ శాఖలు పెట్టి అరెస్టులు చేయండని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం బీజేపీకి అవసరం లేదన్నారు.