MANF రద్దు మైనారిటీల పట్ల కక్ష పూరితమే..

విధాత: మోదీ సర్కారుకు మైనారిటీల నీడ కూడా పడదన్న దాన్ని నిజం చేసి చూపుతున్నది. అవకాశమున్న ప్రతిచోటా మైనారిటీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారి విద్యావకాశాలకు తోడ్పడే ఎంఏఎన్‌ఎఫ్‌ అనే స్కాలర్‌ షిప్‌ స్కీమును కూడా తొలగించింది. మైనారిటీ వర్గాల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా ఉపయోగపడుతున్న మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎంఏఎన్ఎఫ్‌) ను రద్దుచేసింది. ఈ స్కీము ఇతర స్కీములకు అవరోధంగా మారుతున్నదని చెప్పుకొస్తున్నది. దేశంలోని మైనారీటీలు […]

  • By: krs    latest    Dec 10, 2022 1:42 PM IST
MANF రద్దు మైనారిటీల పట్ల కక్ష పూరితమే..

విధాత: మోదీ సర్కారుకు మైనారిటీల నీడ కూడా పడదన్న దాన్ని నిజం చేసి చూపుతున్నది. అవకాశమున్న ప్రతిచోటా మైనారిటీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారి విద్యావకాశాలకు తోడ్పడే ఎంఏఎన్‌ఎఫ్‌ అనే స్కాలర్‌ షిప్‌ స్కీమును కూడా తొలగించింది. మైనారిటీ వర్గాల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా ఉపయోగపడుతున్న మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎంఏఎన్ఎఫ్‌) ను రద్దుచేసింది. ఈ స్కీము ఇతర స్కీములకు అవరోధంగా మారుతున్నదని చెప్పుకొస్తున్నది.

దేశంలోని మైనారీటీలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా, వారి సామాజిక ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులను అధ్యయనం చేయటం కోసం నాటి యూపీఏ ప్రభుత్వ సచార్‌ కమిటీని 2005లో ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులు గల ఈ కమిటీ 2006 నవంబర్‌ 17న రిపోర్టును కేంద్రానికి సమర్పించింది.

ఈ కమీటీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన అనేక చర్యలను సూచించింది. ఆ సిఫారసుల మేరకే ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న మైనారిటీ వర్గాల విద్యార్థులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో ఎంఏఎన్‌ఎఫ్‌ స్కీమును ప్రవేశ పెట్టింది. ఈ స్కీము సాయంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించారు.

నిజానికి ఈ స్కీము ప్రకారం.. మైనారిటీలు అంటే.. కేవలం ముస్లింలే కాదు. సిక్కుల, జైనులు, బౌద్ధులు, పార్శీలు కూడా మైనారిటీ వర్గాలుగా పరిగణించింది. ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఏటా కోట్లాది రూపాయలను విడుదల చేసి ఎంఏఎన్‌ఎఫ్‌ స్కీమును అములు చేసింది. ఇప్పుడు ఉన్నపలంగా ఇతర స్కీములకు ప్రతిబంధకంగా ఉన్నదన్న పేరుతో తొలగించటం మైనారిటీల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించటమేనన్న విమర్శలు వస్తున్నాయి.