‘పవర్ లూమ్ టెక్స్‌టైల్స్’ ఛైర్మన్‌గా గూడూరి బాధ్యతల స్వీకరణ
విధాత: టీఎస్ పవర్ లూమ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గూడూరి ప్రవీణ్ నియమితులయ్యారు. కార్పొరేషన్ ఛైర్మన్ గా మంత్రి కేటీఆర్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు చేనేత రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. దక్షిణభారత దేశంలో అభివృద్ధి చెందిన చేనేత పరిశ్రమపై అధ్యయనం చేస్తామని, కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్, అపెరల్ […]

విధాత: టీఎస్ పవర్ లూమ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గూడూరి ప్రవీణ్ నియమితులయ్యారు. కార్పొరేషన్ ఛైర్మన్ గా మంత్రి కేటీఆర్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
యువత విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు చేనేత రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. దక్షిణభారత దేశంలో అభివృద్ధి చెందిన చేనేత పరిశ్రమపై అధ్యయనం చేస్తామని, కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
సిరిసిల్ల టెక్స్‌టైల్, అపెరల్ పార్క్‌లో 10 వేల మందికి ఉపాధే లక్ష్యమని తెలిపారు. వరంగల్‌లో రెండు మెగా టెక్స్‌టైల్ పార్కులు వచ్చాయన్నారు.