మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ విజువల్స్‌ (వీడియో)

వేగంగా ఢీ కొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి.. ముగ్గురికి గాయాలు.. ఆస్ప‌త్రిలో చికిత్స‌ విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మున్సిపల్ కార్యాలయం దగ్గర శనివారం ఉదయం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు పారిశుధ్య పనుల నిమిత్తం విధులకు వచ్చిన 5 గురు పారిశుధ్య కార్మికులను రాందాస్ చౌరస్తా నుండి వేగంగా వస్తున్న టిఎస్ 35 ఎఫ్ 9766 ఆల్టో కారు ఢీకొట్టడంతో దాయర వీధి కి చెందిన నర్సమ్మ (41)అక్కడిక‌క్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ […]

  • By: krs    latest    Dec 24, 2022 9:31 AM IST
మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ విజువల్స్‌ (వీడియో)
  • వేగంగా ఢీ కొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి..
  • ముగ్గురికి గాయాలు.. ఆస్ప‌త్రిలో చికిత్స‌

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మున్సిపల్ కార్యాలయం దగ్గర శనివారం ఉదయం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు పారిశుధ్య పనుల నిమిత్తం విధులకు వచ్చిన 5 గురు పారిశుధ్య కార్మికులను రాందాస్ చౌరస్తా నుండి వేగంగా వస్తున్న టిఎస్ 35 ఎఫ్ 9766 ఆల్టో కారు ఢీకొట్టడంతో దాయర వీధి కి చెందిన నర్సమ్మ (41)అక్కడిక‌క్కడే మృతి చెందింది.

ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, పట్టణ, రూరల్ సీఐలు మధు, విజయకుమార్, ఎస్సైలు రాజశేఖర్, మల్లారెడ్డి, విట్టల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం హాస్పటల్ కి తరలించడంతో చికిత్స పొందుతూ యాదమ్మ (53) అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది.

ఇద్దరు మున్సిపల్ కార్మికులు మృతి చెందిన విషయం తెలియడంతో మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ప్ర‌ధాన గేటు ముందు ధ‌ర్నా నిర్వహించారు.

ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి

మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్, విజయలక్ష్మి డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఆకిరెడ్డి కృష్ణా రెడ్డి, మమిల్ల ఆంజనేయులు, రాగి అశోక్, అర్ కే శ్రీనివాస్, ప్రభురెడ్డి తదితరులు తరలివచ్చి మున్సిపల్ కార్మికులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికుల మృత‌దేహాలను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెదక్ టౌన్ సిఐ మధు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ప్రమాదానికి కారణం అయిన కార్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కాగా మృతి చెందిన కార్మికులు మెదక్ మున్సిపల్ లో రెగ్యులర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు..

రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థ‌తిలో ఉన్న నీరు పేద కుటుంబాలు వారివి. యాదమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉంది. నర్సమ్మకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. మున్సిపాలిటీలో లో పనిచేస్తేనే పూట గడిచే స్థితిలో కుటుంబాలు ఉన్నాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

పారిశుద్ధ్య‌ కార్మికుల మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే