విధాత: కోదాడ నియోజకవర్గం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసిన ఎస్ఐపై చట్టపర చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఈ సంఘటనపై హోంమంత్రి, డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కాంగ్రెస్ నాయకులపై అనేక సందర్భాల్లో దౌర్జన్యాలకు దిగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డిని కొట్టిన ఎస్ఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి […]
విధాత: కోదాడ నియోజకవర్గం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసిన ఎస్ఐపై చట్టపర చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఈ సంఘటనపై హోంమంత్రి, డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.
ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కాంగ్రెస్ నాయకులపై అనేక సందర్భాల్లో దౌర్జన్యాలకు దిగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డిని కొట్టిన ఎస్ఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సస్పెన్డ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇందుకోసం రేపు ఉదయం 10 గంటలకు తాను, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పార్టీ శ్రేణులతో కలిసి కోదాడ పట్టణ నడిబొడ్డున నిరసన దీక్ష చేపట్టినట్లు ఉత్తమ్ ప్రకటించారు.