Taapsee Pannu | డైటీషియన్‌కే తాప్సీ నెలకు ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? సినీరంగంలోకి వారికి తప్పదంటున్న నటి..!
Taapsee Pannu | ప్రస్తుతం అందరూ ఫిట్‌నెట్‌పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా సినిమా తారల గురించిన చెప్పాల్సిన అవసరం లేదు. ఇందు కోసం భారీగా ఖర్చుపెడుతూ వస్తుంటారు. అయితే, డైటీషియన్‌కు కోసం ఏకంగా నెలకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రముఖ నటి తాప్సీ పన్ను వెల్లడించింది. ఈ విషయం తెలిసి మా నాన్న తనను తిడుతున్నారని చెప్పింది. ఇది ఫ్యాషన్ కోసం ఖర్చు చేయడం లేదని, అవసమని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ అంశం తన […]

Taapsee Pannu | ప్రస్తుతం అందరూ ఫిట్‌నెట్‌పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా సినిమా తారల గురించిన చెప్పాల్సిన అవసరం లేదు. ఇందు కోసం భారీగా ఖర్చుపెడుతూ వస్తుంటారు. అయితే, డైటీషియన్‌కు కోసం ఏకంగా నెలకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రముఖ నటి తాప్సీ పన్ను వెల్లడించింది. ఈ విషయం తెలిసి మా నాన్న తనను తిడుతున్నారని చెప్పింది.
ఇది ఫ్యాషన్ కోసం ఖర్చు చేయడం లేదని, అవసమని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ అంశం తన తల్లిదండ్రులకు, ముఖ్యంగా తన తండ్రికి బాధ కలిగించేదని పేర్కొంది. అదే సమయంలో సినిమారంగంలో డైట్ ఎందుకు అవసరమో పేర్కొంది. తన జీవితమంతా డబ్బులు ఆదా చేసినప్పటికీ, తండ్రి కోసం మాత్రం ఖర్చు చేయనని చెప్పింది.
తనకు, తన సోదరి వివాహం గురించి తండ్రి చింతించాల్సిన అవసరం లేదని.. ఆ ఖర్చులను స్వయంగా తామే భరించగలరని తెలిపింది. తన తండ్రి తనపై ఇప్పటికీ చిరాకుగానే ఉంటారని, తాను చిరాకుగా ఉంటారని చెప్పుకొచ్చింది. ‘నేను త్వరలోనే ఇంటికి వెళ్తాను. డైట్ కోసం ఇంత ఖర్చు పెట్టినందుకు నాన్న నన్ను తిడతాడని నాకు తెలుసు’ అని తెలిపింది.
ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఏ సినిమా చేస్తున్నాను. నా జీవితంలో నేను ఎక్కడ ఉన్నాను అంశంపై నా డైట్ నిరంతరం మారుతుంది. ప్రతి నాలుగైదు సంవత్సరాల తర్వాత, మీ శరీరం సైతం మారుతుంది. మనం ఏ నగరం, ఏ దేశంలో ఉన్నామనేదానిపై ఆధారపడి ఉంటుంది. మనకు ఏ ఆహారం ఉత్తమమైందో చెప్పేందుకు నిపుణుల సలహా అవసరం. ఆహారం విషయంలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక ఉత్పత్తులు ప్రధాన పోషిస్తాయి. డైట్ ప్లాన్‌ను రూపొందించడంలో ఈ వివరాలు ఉంటాయి.
ఓ నటుడు, నటుడికి ఇంకా అధికంగా ఇంకా కోసం ఖర్చు చేస్తారు. మీరు తినే మంచి ఆహారం కోసం ఖర్చు పెట్టడానికి వెనుకాడినప్పుడు ఆసుపత్రుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో డైట్ చాలా మెయిన్ రోల్ పోషిస్తుందని ఆయన(తాప్సీ తండ్రి)కు అర్థం కాదు’ అంటూ పేర్కొంది. నెలకు రూ.లక్ష ఖర్చు పెడుతున్నట్లు తాప్సీ చెప్పడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఇక టాలీవుడ్‌లోకి ‘ఝుమ్మంది నాధం’ సినిమాతో టాలీవుడ్‌కు పరచయమైంది తాప్సీ. వరుస చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ చిత్రాలు హిట్ కావడంతో అక్కడే సెటిల్ అయ్యింది. తాప్సీ చివరి సారిగా థ్రిల్లర్ చిత్రం బ్లర్‌లో కనిపించింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘డుంకీ’లో నటిస్తున్నది.