Manipur | అసలు.. మణిపూర్ ఘర్షణలకు కారణమేంటి..?
Manipur | విధాత: ప్రకృతి అందాలు, గిరిజన జాతుల వైవిధ్యంతో అలరించే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నిరసనలు భగ్గుమన్నాయి. భూమి హక్కులు, అధికారం, సంస్కృతి పరిరక్షణ తదితర అంశాల్లో రెండు వర్గాల మధ్య ఉన్న అంతరమే వీటికి కారణం. రాష్ట్రంలోని మెయితీలకు, నాగా, కుకీ గిరిజన జాతులకు మధ్య ఉన్న ఘర్షణాత్మక వాతావరణమే ఈ అల్లర్లకు దారి తీసింది. అసలు మెయితీలకు, నాగా, కుకీలకు మధ్య ఉన్న సమస్యలేంటి అనేది చూస్తే… https://twitter.com/ashoswai/status/1655233724798074882?s=20 మెయితీలు ఎవరంటే.. రాష్ట్ర […]

Manipur |
విధాత: ప్రకృతి అందాలు, గిరిజన జాతుల వైవిధ్యంతో అలరించే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నిరసనలు భగ్గుమన్నాయి. భూమి హక్కులు, అధికారం, సంస్కృతి పరిరక్షణ తదితర అంశాల్లో రెండు వర్గాల మధ్య ఉన్న అంతరమే వీటికి కారణం. రాష్ట్రంలోని మెయితీలకు, నాగా, కుకీ గిరిజన జాతులకు మధ్య ఉన్న ఘర్షణాత్మక వాతావరణమే ఈ అల్లర్లకు దారి తీసింది. అసలు మెయితీలకు, నాగా, కుకీలకు మధ్య ఉన్న సమస్యలేంటి అనేది చూస్తే…
A burning church in Manipur, India. pic.twitter.com/qLCdFo7hp8
— Ashok (@ashoswai) May 7, 2023
మెయితీలు ఎవరంటే..
రాష్ట్ర జనాభా 35 లక్షల్లో సుమారు 53 శాతం మంది మెయితీలే. ఎక్కువగా రాజధాని ఇంఫాల్ చుట్టుపక్కలే నివసించే వీరంతా హిందూమతాన్ని అనుసరిస్తారు. ఎక్కువగా వీరు మైదాన ప్రాంతాల్లోనే ఉంటున్నప్పటికీ వీరి ఉనికి కొండప్రాంతాల్లోనూ ఉంటుంది.
నాగా, కుకీలు..
ఎక్కువ క్రైస్తవ మతాన్ని అనుసరించే వీరంతా రాష్ట్ర జనాభాలో సుమారు 40 శాతంగా ఉంటారు. ఈ రెండు జాతులూ ఎస్టీ జాబితాలో ఉండటంతో కొండ ప్రాంతాల్లో, అడవుల్లో భూమి హక్కులు వీరికే చెందుతాయి. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ.
Manipur violence – Kuki women came out on the streets, formed a human shield and protected the Meitei from an angry mob in Churachandpur.
This was while Indian army was evacuating civilians. The women formed a wall and did not allow a mob of angry Kuki agitators to proceed… pic.twitter.com/wUpTmmUYrZ
— Pagan 🚩 (@paganhindu) May 5, 2023
ఎస్టీ హోదా కోరడంతో..
తామంతా వెనకబడి ఉన్నామని మెయితీల వాదన. అంతే కాకుండా తమ భూములకు రక్షణ లేదని, శరణార్థులు, చొరబాటుదారులు తమ భూములను ఆక్రమిస్తున్నారనేది వారి ఆరోపణ. ఉద్యోగాల కోసం కాకపోయినా.. తమ సంప్రదాయాన్ని బతికించుకోవాలంటే ఎస్టీ హోదా కావాల్సిందేనని వీరు
ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెయితీలను ఎస్టీల్లో చేర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని మణిపూర్ హైకోర్టు మార్చిలో ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదే క్రమంలో రిజర్వుడు, రక్షిత అటవీ ప్రాంతాన్ని సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అగ్నికి ఆజ్యం పోసింది. ఈ పరిణామాలన్నీ తమను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలుగా
కుకీలు, నాగాలు భావించారు. మే 2న ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ (ఏటీఎస్‌యూఎం) ఆందోళనలకు పిలుపునివ్వడంతో ప్రస్తుత ఘర్షణలు మొదలయ్యాయి.
Churches are being systematically attacked and burned down in Manipur- This is a theological seminary in Imphal. pic.twitter.com/bVtSXeJ06I
— Ashok (@ashoswai) May 7, 2023
రంగంలోకి కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పడంతో కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. కొండప్రాంతాల్లో మైనారిటీలుగా ఉన్న మెయితీలను, మైదాన ప్రాంతాల్లో మైనారిటీలుగా ఉన్న గిరిజన జాతులను ఆయా ప్రాంతాల నుంచి సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో ఇప్పటి వరకు సుమారు 23వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆర్మీ ప్రకటించింది.
https://twitter.com/B5001001101/status/1654068494449917952?s=20
మరికొంత మంది సరిహద్దు రాష్ట్రమైన అస్సాంకు చేరుకుని ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 54 మంది చనిపోగా… వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతానికి అల్లర్లు తగ్గుముఖం పట్టినా.. పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. సున్నిత ప్రాంతాలను
డ్రోన్లు, హెలికాప్టర్‌లతో జల్లెడ పడుతున్నామని సైన్యం తన ప్రకటనలో పేర్కొంది.
https://twitter.com/B5001001101/status/1654031843782705152?s=20