Adilabad | కుంటాలలో BRS అసమ్మతి నేతల సమావేశం.. MLA విఠల్ రెడ్డి పై ఫైర్
Adilabad విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ముధోల్ నియోజకవర్గం బీఆరెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వ్యతిరేక వర్గం నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో జివి రమణ రావు నేతృత్వంలో సమావేశం నిర్వహించడం ఆ పార్టీలో కలకలం రేపింది. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సాంవ్లి రమేష్, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ పండిత్ రావ్, సీనియర్ నాయకులు సోలంకె భీంరావ్ లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముందుగా రైతు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం […]

Adilabad
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ముధోల్ నియోజకవర్గం బీఆరెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వ్యతిరేక వర్గం నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో జివి రమణ రావు నేతృత్వంలో సమావేశం నిర్వహించడం ఆ పార్టీలో కలకలం రేపింది. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సాంవ్లి రమేష్, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ పండిత్ రావ్, సీనియర్ నాయకులు సోలంకె భీంరావ్ లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముందుగా రైతు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
అనంతరం వారు అసమ్మతి వర్గం నాయకుడు జీవి రమణారావు మాట్లాడుతు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు .
ఎమ్మెల్యే ప్రజల్లో లేకపోవడం వల్ల అసమ్మతి పెరుగుతుందని, సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లను వెంట పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రజల బాగోగులు, కష్టాలను చూడడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంట చేలతో పాటు రోడ్లు కోతకు గురికాగా పలు ఇల్లు నేల కులాయని అయినా ఎమ్మెల్యే వారికి ఆర్థికంగా ఆదుకోవడంలో విఫలమయ్యాడన్నారు.
గురుకుల పాఠశాలలకు నియోజకవర్గంలో ఎక్కడైనా స్వంత భవనాలు కట్టించిన పాపాన పోలేదన్నారు. అంతేకాకుండా కుబీర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ముగిసి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కొత్త పాలకవర్గం నియమించలేదన్నారు. గత 5 సంవత్సరాల నుండి బాసర దేవస్థాన పాలకమండలి ఏర్పాటుచేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యాడన్నారు. ఏది ఏమైనా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.