Adilabad | అదిలాబాదులో ఉద్రిక్తతకు దారితీసిన అధికార, విపక్షాల ఆందోళన

Adilabad విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలువెత్తు దిష్టి బొమ్మను ఉరితీసి వేలాడ దీశారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ […]

Adilabad | అదిలాబాదులో ఉద్రిక్తతకు దారితీసిన అధికార, విపక్షాల ఆందోళన

Adilabad

విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలువెత్తు దిష్టి బొమ్మను ఉరితీసి వేలాడ దీశారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే వేలాడ దీసిన పిసిసి అధ్యక్షుడి దిష్టి బొమ్మను ఒక గంట లోపు తొలగించాలని డిమాండ్ చేశారు.

తొలగించక పోతే తామే వెళ్ళి తీసేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే బిఆర్ ఎస్ పార్టీ నాయకులు గానీ, పోలీసులు గాని ఆ దిష్టిబొమ్మను తొలగించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ కార్యకర్తలతో కలిసి వెళ్ళి దిష్టిబొమ్మను తొలగించే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాట, వాగ్వివాదంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అస్వస్థతకు గురయ్యాడు.

పోలీసు స్టేషన్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ వెళ్ళి పరామర్శించారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ పోలీసు స్టేషన్ లోనే నిరసన తెలిపారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

తమ పార్టీ పట్టణాధ్యక్షుడిపై చేసిన దాడికి అస్వస్థతకు గురయ్యాడని ఆరోపించారు. నగేష్ వారి బృందంపై పోలీసులు ముకుమ్మడి దాడి చేసి వారిని దౌర్జన్యంగా పోలీసు జీపులో ఎత్తి పడేశారని అన్నారు. బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న దిష్టి బొమ్మలను తగలబెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.