మునుగోడు ఓటర్ల జాబితాపై విచారణ 21కి వాయిదా
విధాత: మునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సవరించిన ఓటరు జాబితా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఓటరు జాబితా విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 11 నాటికి మునుగోడు ఓటర్లు 2,38, 759 అని సీఈవో కోర్టుకు తెలిపారు. 25,013 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. 12,249 కొత్త […]

విధాత: మునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సవరించిన ఓటరు జాబితా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఓటరు జాబితా విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని స్పష్టం చేసింది.
ఈ నెల 11 నాటికి మునుగోడు ఓటర్లు 2,38, 759 అని సీఈవో కోర్టుకు తెలిపారు. 25,013 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. 12,249 కొత్త ఓటర్లకు అనుమతి ఇచ్చి 7,247 ఓట్లను తిరస్కరించా మన్నారు. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తవుతుందన్నారు. మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొన్నది.
ఇదిలాఉండగా ఎన్నికల సంఘం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.