విచ్చల విడిగా కల్తీ మద్యం.. అధికారుల మైండ్ బ్లాక్.. షాక్‌లో మందుబాబులు

నిన్న ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో.. తాజాగా నల్గొండ జిల్లా అనుములలో.. విధాత: తెలంగాణలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఓ చిన్న సమాచారంతో హయత్ నగర్ శివారులో బెల్ట్ షాపులపై దాడి చేయడంతో వెలుగు చూసిన‌ నకిలీ మద్యం నిల్వల వ్యవహారం తీగ లాగితే డొంక కదిలినట్లుగా నకిలీ మద్యం రాకెట్ గుట్టును బహిర్గతం చేసింది. నకిలీ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యేటట్లుగా వరుస దాడుల్లో […]

విచ్చల విడిగా కల్తీ మద్యం.. అధికారుల మైండ్ బ్లాక్.. షాక్‌లో మందుబాబులు
  • నిన్న ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో..
  • తాజాగా నల్గొండ జిల్లా అనుములలో..

విధాత: తెలంగాణలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఓ చిన్న సమాచారంతో హయత్ నగర్ శివారులో బెల్ట్ షాపులపై దాడి చేయడంతో వెలుగు చూసిన‌ నకిలీ మద్యం నిల్వల వ్యవహారం తీగ లాగితే డొంక కదిలినట్లుగా నకిలీ మద్యం రాకెట్ గుట్టును బహిర్గతం చేసింది.

నకిలీ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యేటట్లుగా వరుస దాడుల్లో కోట్ల విలువ చేసే కల్తీ మద్యం బయట పడుతోంది.. నిన్న ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయల నకిలీ లిక్కర్ పట్టుబడగా, నకిలీ మద్యం రాకెట్ ముఠా మూలాలు తవ్వుతున్న కొద్ది అక్రమాల చిట్టా మొత్తం వెలుగులోకి వస్తుంది.

తాజాగా నల్గొండ జిల్లా అనుముల పీఎస్ పరిధిలో ఓ బత్తాయి తోటపై హాలియా ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 42 కాటన్ ల నకిలీ మద్యం దొరికింది. ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరింత సమాచారం కోసం కూపీ లాగుతున్నారు.

కాగా హైద్రాబాద్ తో పాటు నగరానికి దగ్గర్లో ఉన్నయాదాద్రి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో నకిలీ లిక్కర్ దందా జోరుగా సాగుతున్నట్టు అధికారులు ఆలస్యంగా గ్రహించారు. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి, ఒరిజినల్ మద్యాన్ని రకరకాల కెమికల్స్ తో మిక్స్ చేసి, కల్తీ చేసిన లిక్కర్ ను బెల్ట్ షాపులు, వైన్స్ లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

ఇన్నాళ్లుగా ఖాకీల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా నకిలీ లిక్కర్ తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు.. ఉమ్మడి జిల్లా పరిధిలో 20కి పైగా వైన్స్ లు ఉన్న బాలరాజ్ గౌడ్, కొండల్ రెడ్డి వైన్స్ లలో ఎక్కువగా నకిలీ మద్యం విక్రయాలు సాగుతున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

మరోవైపు నకిలీ లిక్కర్ స్కాం వ్యవహారం ఇప్పుడు మందు బాబులకు షాకిస్తుంది. ఇన్నాళ్లు కల్తీ మద్యంతో ఒళ్లు గుల్ల చేసుకున్నామనే ఆందోళన వారిని కలవరపెడుతుంది.