చంద్రబాబు సభలో మళ్లీ విషాదం! ఈసారి ముగ్గురు మృతి
విధాత: నెల్లూరు జిల్లా కందుకూరు సభలో మొన్న ఎనిమిదిమంది మరణించిన ఘటన కళ్ళ ముందు కదలాడుతుండగానే చంద్రబాబు సభలో మరో ప్రమాదం జరిగింది. ఈసారి ముగ్గురు మరణించగా ఇంకో నలుగురు గాయపడ్డారు. ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన జనత వస్త్రాలు, చంద్రన్న […]

విధాత: నెల్లూరు జిల్లా కందుకూరు సభలో మొన్న ఎనిమిదిమంది మరణించిన ఘటన కళ్ళ ముందు కదలాడుతుండగానే చంద్రబాబు సభలో మరో ప్రమాదం జరిగింది. ఈసారి ముగ్గురు మరణించగా ఇంకో నలుగురు గాయపడ్డారు.
ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన జనత వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగింది. కానుకలు అందుకునేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. నిర్వాహకులు సరిగా ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది.
ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ఇంకో ఇద్దరు మహిళలు కన్నుమూశారు. మొత్తానికి చంద్రబాబు సభలన్నీ ఇలా సంతాప సభలుగా మారుతున్నాయని అంటున్నారు..