ఎమ్మెల్యేల కొనుగోలు.. నిందితులపై కేసు నమోదు
విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులపై కేసు నమోదైంది. ఏ1గా ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ2గా హైదరాబాద్‌కు చెందిన నందకిషోర్, ఏ3 గా తిరుపతికి చెందిన సింహయాజులు పై పోలీసులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు ఇస్తామని ఆశ చూపినట్లు, ఆ పార్టీలోకి లాగేందుకు […]

విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులపై కేసు నమోదైంది. ఏ1గా ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ2గా హైదరాబాద్‌కు చెందిన నందకిషోర్, ఏ3 గా తిరుపతికి చెందిన సింహయాజులు పై పోలీసులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు.
బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు ఇస్తామని ఆశ చూపినట్లు, ఆ పార్టీలోకి లాగేందుకు కుట్ర చేశారు. డబ్బు ఆశతో పాటు కాంట్రాక్టు పనులు ఇస్తామని ఆశ చూపారు. పార్టీ మారకపోతే ఈడీ, సీబీఐతో దాడులు చేస్తామని బెదిరించినట్లు రోహిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు రాత్రి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్లోనే ఉన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని టీఆర్ఎస్ మండి పడింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని పలువురు మంత్రులు ఖండించారు. నలుగురు ఎమ్మెల్యేల నివాసాల వద్ద పోలీసులు భద్రత పెంచారు. కాగా ప్రలోభాల ఎరపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పార్టీ అప్పగించిన పనిని, బాధ్యత గల పౌరునిగా విజయవంతం చేశాను. క్రమశిక్షణ గల బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశాను అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లారా .. గర్వపడండి అని ఎమ్మెల్యే పోస్టులో పేర్కొన్నారు.